Hybrid Tomato : దిగుడితోపాటు, తెగుళ్ళను తట్టుకునే …ఆర్క రక్షక్ హైబ్రిడ్ టొమాటో
Hybrid Tomato : భారతీయుల ఆహారంలో టొమాటో ఒక భాగమైపోయింది. ఇందులో విటమిన్ సి, పీచుపదార్ధాలు, పొటాషియం అధికంగా లభిస్తుంది. పోషకాలతో కూడిన టొమాటోను కూరల్లో , సాస్ గా వివిధి రూపాల్లో వినియోగస్తుంటారు. మన దేశంలో ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్, మహారాష్ట్ర, బెంగాల్ రాష్ట్రాలలో టొమాటో సాగును రైతులు చేపడుతున్నారు. తెగుళ్ళు, చీడపీడలు టొమాటో రైతును ప్రతిఏటా కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఈ క్రమంలో బెంగుళూరులోని జాతీయ ఉద్యాన సంస్ధ కు చెందిన శాస్త్రవేత్త .ఎ.టి సదాశి అన్ని రకాల తెగుళ్ళను తట్టుకునే ఆర్క రక్షక్ పేరుతో హైబ్రీడ్ టొమాటో రకాన్ని అభివృద్ధి చేశారు.
ఆర్క రక్షక్ హైబ్రీడ్ రకం టొమాటో విత్తనం రైతులకు ఓ వరంగా మారింది. ఈ రకం సాగులో ఎకరానికి 25 నుండి 30 గ్రాముల విత్తనం సరిపోతుంది. 140 నుండి 150 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరానికి 40 నుండి 50 టన్నుల వరకు దిగుబడి ఇస్తుండగా ఒక్కో చెట్టు నుండి సుమారుగా 18 కిలోల వరకు టొమాటో పండుతుంది. ముదురు ఎరుపు రంగులో ఉండే టొమాటో 10 నుండి 15 రోజుల వరకు నిల్వ సామర్ధ్యం కలిగివుంటుంది. ఈ రకం సాగుతో ఎకరానికి 4నుండి 5లక్షల రూపాయల వరకు అదాయం పొందవచ్చు.
అర్కరక్షక్ సాగు చేపట్టే రైతాంగం కొన్ని సాగు విధానాలను పాటిస్తే మంచి దిగుబడులతో పాటు అదాయాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. డ్రిప్ విధానంతో సాగు చేపట్టి ఫెర్టిగేషన్ విధానంలో పోషకాలను అందించటం ద్వారా మంచి దిగుబడులు పొందవచ్చు.ఆకుముడత, ఎండు తెగులు, బ్యాక్టీరియా తెగుళ్ళను ఈ రకం సమర్ధ వంతంగా తట్టుకుని మంచి ఫలసాయాన్ని ఇస్తుంది. ప్రస్తుతం కర్నాటకతోపాటు, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ , హర్యానా, తదితర రాష్ట్రాల రైతులు అర్కా రక్షక్ టొమాటో సాగుకు శ్రీకారం చుట్టి మంచి ఫలితాలు పొందుతున్నారు.
ఎక్కువ రోజులు నిల్వ ఉండే సామర్ధ్యం ఉండటం వల్ల మార్కెట్లో ఇతర రకాల కంటే అధిక ధరకు అమ్ముకోవచ్చు. ప్రస్తుతం ఈ రకం విత్తనం మార్కెట్లో అందుబాటులో ఉంది. పదిగ్రాముల విత్తనం ధర 600 నుండి 700 రూపాయల వరకు వివిధ కంపెనీలు విక్రయిస్తున్నాయి. అన్ని రకాల వాతావరణ పరిస్ధితుల్లో ఈ రకం టొమాటో సాగుకు అనుకూలంగా ఉంటుంది. చీడపీడలు, తెగుళ్ళ బెడద తక్కువగా ఉండటంతో రైతులకు పంట ఖర్చులు తగ్గుతాయి. ఎక్కవ కాలం నిల్వఉండేందుకు అవకాశం ఉండటంతో ఇతర దేశాలకు ఈ రకం టొమాటో ఎగుమతులకు ఉపయోగకరంగా ఉంటుంది.
COMMENTS