Driving Licence: స్మార్ట్‌ఫోన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ డౌన్లోడ్ చేయండి ఇలా
వాహనం నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. లైసెన్స్ లేకుండా వాహనం నడపకూడదు. లైసెన్స్ తీసుకుంటే వాహనం నడిపే సమయంలో లైసెన్స్ కాపీ వాహనదారుడి వెంట ఉండాలి. గతంలో జేబులో లేదా వాహనంలో లైసెన్స్ క్యారీ చేయాల్సి వచ్చేది. కానీ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఈ అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిజిటల్ పద్ధతుల్లో డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లాంటి కాపీలను చూపించొచ్చు. ఇందుకు అనుమతి ఉంది. డిజీలాకర్ లేదా ఎంపరివాహన్ యాప్‌లో వీటిని డౌన్లోడ్ చేసుకొని సాఫ్ట్ కాపీ స్మార్ట్‌ఫోన్‌లో దాచుకుంటే చాలు. స్మార్ట్‌ఫోన్‌లో ఇవి ఉంటే మీరు ప్రత్యేకంగా ఫిజికల్ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ క్యారీ చేయాల్సిన అవసరం లేదు.
వాహనదారులకు ఈ సమస్య ఉండకూడదనే ప్రభుత్వం డిజిటల్ కాపీలను అనుమతిస్తున్నాయి. ఫిజికల్ కాపీ తీసుకెళాల్సిన అవసరం లేదు కాబట్టి అవి పోతాయన్న టెన్షన్ కూడా ఉండదు.
డిజీలాకర్‌లో మీ డ్రైవింగ్ లైసెన్స్ డౌన్లోడ్ చేయడానికి ముందుగా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మీ ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ తప్పనిసరి. ఆ తర్వాత మీ యూజర్ నేమ్, ఆరు అంకెల పిన్ ద్వారా లాగిన్ కావాలి. మీ రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి. సైన్ ఇన్ అయిన తర్వాత మీ ఆధార్ నెంబర్‌ను డిజీలాకర్‌కు లింక్ చేయాల్సి ఉంటుంది. లింక్ చేసిన తర్వాత Get Issued Documents పైన క్లిక్ చేయాలి. అందులో డ్రైవింగ్ లైసెన్స్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఏ రాష్ట్రంలో తీసుకుంటే ఆ రాష్ట్రానికి చెందిన రవాణా శాఖకు సంబంధించిన లింక్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు ఎంటర్ చేసి Get Document పైన క్లిక్ చేయాలి.
రవాణా శాఖ సర్వర్ నుంచి మీ డ్రైవింగ్ లైసెన్స్ డాక్యుమెంట్ మీ డిజీలాకర్ అకౌంట్లోకి వస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ సాఫ్ట్ కాపీని కూడా మీరు ఇక్కడి నుంచే డౌన్లోడ్ చేయొచ్చు. మీరు డిజీలాకర్ యాప్ ఉపయోగించకూడదు అనుకుంటే mParivahan యాప్ ద్వారా కూడా డ్రైవింగ్ లైసెన్స్ సాఫ్ట్ కాపీ పొందొచ్చు. ప్రాసెస్ దాదాపు ఇదే విధంగా ఉంటుంది.
COMMENTS