Cultivation Of Orchards : పండ్ల తోటల సాగులో మెలుకువలు
Cultivation Of Orchards : పత్తి, మిర్చి, వంటి పంటలకు భిన్నంగా పండ్ల తోటల సాగులో ప్రత్యేక మెలుకువలు పాటించాల్సిన అవసరం ఉంది. అధిక దిగుబడులు సాధించటానికి తొలినుండే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పొలం ఎంపిక , నేల, నీటి సదుపాయం తదితర అంశాలు, దిగుబడులు పొందటానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి. పండ్ల తోటల పెంపకానికి ఎంపిక చేసిన పొలానికి నీటి వసతి చూసుకోవాలి. వాతావరణం, ఇతర వసతులు గమనించాలి. మొక్కలు, పండ్లు రవాణాకు వీలుగా పొలం వరకు సరైన దారి ఉండేలా చూసుకోవాలి. ఆ ప్రాంతంలో అధికంగా ఉండే పంటలను ఎంపిక చేసి సాగు చేపట్టాలి.
పండ్ల చెట్ల వేర్లు భూమి లోపలికి చొచ్చుకు పోతాయి. కాబట్టి తక్కువ లోతు నేలలు, రాతి పొర నేలలు ఈ పంటల సాగుకు పనికిరావు. రెండు మీటర్ల లోతు కలిగి నీరు ఇంకే నేలలు అనుకూలంగా ఉంటాయి. తోట నాటే ముందు ఆనేల భౌతిక , రసాయన గుణాలను భూసార పరీక్షల ద్వారా తెలుసుకోవాలి. మట్టి నమూనాలు సేకరించే సమయంలో రెండు మీటర్ల లోతు వరకు వేర్వేరు చోట్ల గోతులు తీసి మట్టి సేకరించాలి. పరీక్షలో వెల్లడైన ఫలితాల అధారంగా చర్యలు చేపట్టాలి.
రోడ్లు నీటి కాలువలు, మురుగునీటి కాలువలు, గట్లు తయారు చేసుకోవాలి. భూమిన బాగా దున్ని ఒక శాతం వాలు ఉండేటట్లు చేసుకోవాలి. కొండ ప్రాంతం , వాలు ఉన్న చోట భూమిని ఒక పద్దతి ప్రకారం విభజించి మొక్కలు నాటుకోవాలి. నిస్సారమైన నేలల్లో పచ్చిరొట్ట పంటను పెంచి పూత దశలో నేలలో కలియదున్నాలి. చెట్టునాటే చోట గుర్తుగా పుల్లలు గుచ్చుకోవాలి. అక్కడే గుంతలు తీయాలి. ఎండాకాలంలో గుంతలు తీసి 12 రోజులు ఎండకు ఎండ నివ్వాలి. దీని వల్ల నేలలో ఉన్న పురుగులు, వాటి గుడ్లు, తెగుళ్లను కలిగించే శిలీంద్రాలు నశిస్తాయి. తర్వాత మొక్కలు నాటుకోవటం మంచిది.
COMMENTS