Crab Cultivation : రిస్క్ తక్కువ, అదాయం ఎక్కువ… ఆంధ్రాలో పీతల సాగు…బహుబాగు
Crab Cultivation : భారతదేశంలో అక్వా ఉత్పత్తి, ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్ధానంలో ఉంది. ఏపికి సువిశాలమైన సముద్ర తీరం ఉండటంతో ఆ ప్రాంతంలోని రైతాంగం అక్వాసాగువైపు మొగ్గు చూపుతున్నారు. అక్వారంగంలో అత్యధికంగా ఈ ప్రాంతంలో రొయ్యలు సాగవుతుండగా, ఆతరువాత స్ధానంలో పీతలు, పండుగొప్ప, మంచినీటి చేపల సాగును ఇక్కడి రైతాంగం చేపడుతుంది. ఇటీవలికాలంలో ఉప్పునీటి పీతల సాగుపై అధికశాతం రైతాంగం మొగ్గు చూపుతుంది.
ఏపిలోని ఉభయగోదావరి జిల్లాలోని భీమవరం, అంతర్వేది, రాజోలు, మొగల్తూరు, నరసాపురం, కృష్నా జిల్లాలోని కృతివెన్ను, మచిలీపట్నం, చల్లపల్లి, కైకలూరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని తీర ప్రాంత మండలాల్లో ఇప్పటికే ఉప్పునీటి పీతల సాగు చేపట్టిన రైతులు మంచి ఫలసాయాన్ని పొందుతున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో పీతల ధర కేజీ 1200 రూపాయల నుండి 1600 రూపాయల వరకు పలుకుతున్నాయి. తీరప్రాంతంలో ఉప్పునీటి వనరులలో పీతల పెంపకం చేపడితే మంచి లాభసాటిగా ఉంటుందని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉప్పునీటి చెరువుల్లో సాగవుతున్న వనామీ రొయ్యల సాగులో అనేక సమస్యలు తలెత్తుతున్న నేపధ్యంలో లాభసాటిగా ఉన్న పీతల పెంపకం వైపు రైతులు అడుగులు వేస్తున్నారు..
పీతల పెంపకంలో రిస్కు తక్కువగా ఉండటం వల్లే వాటి సాగువైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. పచ్చపీత, మండ పీత వంటి రకాలు ఈ ప్రాంతంలో సాగుకు అనుకూలంగా ఉండటం దిగుబడులుకూడా బాగా వస్తుండటంతో మంచి లాభదాయంగా మారింది. ఈ రెండు రకాల పీతలు నీరు లేకపోయిన 48 గంటల పాటు జీవించ గలవు.
బ్రతికున్న పీతలకు విదేశీ మార్కెట్లో ఎప్పుడైనా మంచి డిమాండ్ ఉంది. ఏడాది పొడవునా పీతల సాగు ద్వారా అదాయం పొందేందుకు అవకాశం ఉంది. పీతలసాగు ద్వారా అధిక అదాయం సమకూరుతుండటంతో సన్న చిన్నకారు రైతులతోపాటు, నిరుద్యోగులు సైతం పీతల సాగువైపు ఆసక్తి చూపుతున్నారు.
COMMENTS