Cotton Crop: పత్తిలో తెగుళ్ల నివారణ
Cotton Crop: వాతావరణ మార్పులతో పత్తిలో తెగుళ్ళ ఉధృతి – నివారణకు చేపట్టాల్సిన యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ఈ ఖరీఫ్ లో వేసిన పత్తి పైరు పలు ప్రాంతాల్లో వివిధ దశల్లో ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా పూత, కాసే దశల్లో ఉన్న పత్తిపై చీడపీడల ఉదృతి పెరిగింది. ముఖ్యంగా తెగుళ్లతో పాటు ఆకుమచ్చ, బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుళ్లు ఆశించి తీవ్రం నష్టపరుస్తున్నాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి వరంగల్ జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా. రాం ప్రసాద్ తెలియజేస్తున్నారు.
ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిశాయి. దానికి తగ్గట్టుగానే రైతులు పంటలను సాగుచేశారు. నియంత్రిత పంటల విధానంలో భాగంగా ఈ ఏడాది పత్తి విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుతం పూత, కాసే దశలో ఉంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలు, ప్రస్తుతం వాతావరణంలో ఉన్న తేమ కారణంగా పత్తిలో చీడపీడల సమస్య అధికమయ్యింది. ముఖ్యంగా రసంపీల్చు పురుగులైన పచ్చదోమ వలన పంటకు అధిక నష్టం జరుగుతుంది.
మొక్కల నుంచి రసం పీల్చటం వల్ల పెరుగుదల తగ్గిపోయి, దిగుబడులపై ప్రభావం తీవ్రంగా వుంటుంది. పచ్చదోమ నష్టపరిచే విధానం, నివారణకు పాటించాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా. రాం ప్రసాద్ .
అధిక తేమతో కూడిన వాతావరణం ఉండటంతో చాలా ప్రాంతాలలో కాయకుళ్ళు తెగులు ఆశించింది. కాయదశలో ఉన్నప్పుడు వర్షాలు అధికంగా పడితే అనేక రకాల శిలీంధ్రాలు ఆశించి కాయలు కుళ్లిపోతాయి. పురుగుల వల్ల ఏర్పడిన రంధ్రాల ద్వారా శిలీంద్రాలు కాయలోకి ప్రవేశించిన తెగులును కలుగజేస్తున్నాయి. మరో వైపు ప్రస్తుతం వర్షాల కారణంగా పత్తిలో పోషకాల లోపం ఏర్పడి ఒడలిపోతున్నాయి.
COMMENTS