Cattle : పశువుల్లో గజ్జి వ్యాధి నివారణ
Cattle : భారతదేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే జనాభా వ్యవసాయంతోపాటు పశుపోషణను జీవనోపాధిగా చేసుకుని జీవనం సాగిస్తున్నారు. చాలా మంది పశువుల యజమానులు వాటి పోషణ, ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అవగాహనా లేకపోవడం వల్ల అనేక ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మక్కువతో పెంచుకున్న పాడిపశువులు అనారోగ్యాల బారిన పడుతున్నాయి. తద్వారా అవి మృత్యువాత పడుతున్నాయి. ప్రధానంగా పశువుల్లో రింగ్వార్మ్, దురద, పేను వంటి సమస్యలు వచ్చినా పెద్దగా పట్టించుకోరు. దీని కారణంగా ఈ జంతువులు వ్యాధి బారిన పడతాయి.
గజ్జి వ్యాధి అనేది జంతువులలో అధికంగా కనిపిస్తుంది. దీని కారణంగా జంతువు లేదా పశువులు బలహీనంగా మారతాయి. పాల దిగుబడి తగ్గుతుంది. వ్యాధి లక్షణాలు కంటికి కనిపిస్తున్నా రైతులు పెద్దగా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. వ్యాధి తక్కువ ఉన్న సందర్భంలో సరైన చికిత్సను అందించినట్లైతే వెంటనే దాని నుండి జంతువును రక్షించుకోవచ్చు. గజ్జి వ్యాధి వచ్చిన సందర్భంలో జంతువుల చర్మం కోల్పోవడం ముఖ్యమైన లక్షణాలలో ఒకటి. జంతువులలో దురద, జుట్టు రాలడం ,జంతువులు ఆకలిని కోల్పోవటం వంటివి జరుగుతాయి.
ఈ జబ్బురావటానికి కారణం జంతువుల చుట్టూ ఉండే మురికి ముఖ్యకారణం. అందుకే పశువులను ఉంచే ప్రదేశాలను నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలి. జంతువుల పేడ, మూత్రం వంటి వాటిని తొలగించాలి. శుభ్రపరిచే సమయంలో 5 గ్రాముల రెడ్ మెడిసిన్ లేదా 50 మిల్లీలీటర్ల ఫినైల్ కలిపి జంతువులు ఉండే ప్రదేశంలో స్ప్రేచేయాలి. దీని వల్ల జంతువులకు వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుంది. సంవత్సరానికి ఒకసారి యాంటెల్మింటిక్ ఔషదాన్ని వాడుకోవాలి. అంటు వ్యాధులపట్ల అవగాహన కలిగి ఉండి ముందస్తు జాగ్రత్తలతోపాటు వ్యాధి సోకిందని తెలియగానే చికిత్స చేయించటం మంచిది. పశువుల్లో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయాలి.
COMMENTS