Caring For Chickens : వేసవిలో కోళ్ల సంరక్షణ విషయంలో జాగ్రత్తలు
Caring For Chickens : వేసవి కాలంలో కోళ్ల పెంపకం విషయంలో తగినంత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇటివలి కాలంలో వ్యవసాయానికి అనుబంధంగా చాలా మంది రైతులు కోళ్ల పెంపకాన్ని చేపడుతున్నారు. ఈ నేపధ్యంలో ముఖ్యంగా వేసవి కాలంలో కోళ్ల పరిశ్రమకు ఎండ వేడిమి కారణంగా ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టాలపాలవుతారు. అయితే ముందుస్తుగా జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం నష్టాల నుండి బయటపడవచ్చు. తీవ్రమైన ఎండ వేడి కారణంగా కోళ్లు మృత్యువాత పడుతుంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా రైతులు పెట్టిన పెట్టుబడి చేజారిపోతుంది.
వేసవిలో సాధారనంగా కోళ్లు తక్కువ నాణ్యత కలిగిన ఆహారం తీసుకోవటం, కలుషిత నీరు తాగటం, గాలి, పరాన్న జీవుల వల్ల త్వరగా వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత కన్నా వాతావరణంలో వేడి అధికంగా ఉన్నప్పుడు కోళ్లు ఆయాసపడుతుంటాయి. తక్కువ మేత తీసుకుంటాయి. ఎక్కువ నీటిని తాగుతాయి. ఇలాంటి సందర్భంలో వడదెబ్బకు గురై చనిపోయే ప్రమాదం అధికంగా ఉంటుంది. దీన్ని అధిగమించేందుకు షెడ్లపై కొబ్బరి మట్టలు, వరిగడ్డ వేసుకుని నీటితో తడపాలి. గోడలు తక్కు వ ఎత్తులో నిర్మించుకుని పట్టాలు కట్టి వాటిని తడుపూ షెడ్డు వాతావరణాన్ని చల్లగా మార్చాలి.
వేసవి సమయంలో కోళ్ల గుడ్డ ఉత్పత్తి తగ్గుతుంది. దీన్ని అధిగమించేందుకు కోళ్ళకు షెడ్డులో చల్లని వాతావరణం కల్పించాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని అందించాలి. తాగేందుకు చల్లని నీటిని అందించాలి. కోళ్ల ఫారాలను శుభ్రంగా ఉంచుకోవటంతోపాటు, గుడ్లు పెట్టిన వెంటనే తీసివేయాలి. నీటిలో ప్రొటీన్, గ్లూకోజ్, బీకాం ప్లెక్స్ ద్రావణాన్ని తగిన మోతాదులో కలిపి అందించాలి. వ్యాధి నిరోధకత కోసం వైద్యుల సలహాల మేరకు టీకాలు వేయించాలి. కొక్కెర వ్యాధి సోకే ప్రమాదం ఉండే అవకాశాలు నేపధ్యంలో టీకాలు వేసుకోవాలి. షెడ్లలోకి వడగాలి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో ఉదయం 10 గంటల లోపు, సాయంత్రం 5గంటల లోపు కోళ్లకు పోషకాలు కలిగిన మేతను అందించాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే వేసవి నుండి కోళ్లను కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా రైతుకు కోళ్ల పరిశ్రమ ద్వారా లాభాలు పొందవచ్చు.
COMMENTS