Calves : చిన్న వయస్సు లేగ దూడలు… పాడిరైతులు పాటించాల్సిన జాగ్రత్తలు
Calves : పాడిరైతులు పశుపోషణ విషయంలో అనేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. తమ వద్ద ఉండే లేగదూడలను నిరంతర పర్యవేక్షణతో వాటి ఎదుగుదలకు తోడ్పాటునందించాలి. అలా చేస్తే భవిష్యత్తులో అవి పాడి రైతులకు మంచి అదాయ వనరుగా మరేందుకు అవకాశం ఉంటుంది. లేగదూడల పెంపకంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని పశుసంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు.
దూడ పుట్టగానే శ్వాస సక్రమంగా తీసుకుంటుందో లేదు గమనించాలి. నోరు, ముక్కులకు ఉండే జిగట వంటి పదార్ధాన్ని తొలగించుకోవాలి. తద్వారా లేగదూడకు శ్వాస సక్రమంగా అందేందుకు వీలవుతుంది. దూడ శరీర బాగాలన్నింటిని పరిశీలించాలి. అవయవాలు సక్రమంగా ఉన్నాయాలోదో పరిశీలించి ఒక వేళ ఏదన్న అవయవయంలోపం గమనిస్తే వెంటనే పశువైద్యుల ద్వారా శస్త్ర చికిత్స చేయించుకోవాలి.
పుట్టిన కొన్ని గంటలకు లేగదూడ బరువు ఎంత కలిగి ఉందో చూడాలి. అనంతరం బొడ్డు కింది బాగంలో వేలాడుతూ ఉండే దారం వంటి పేగు బాగాన్ని రెండు అంగుళాలు వదిలి పెట్టి కత్తిరించాలి. కత్తిరించగా మిగిలిన బాగానికి టింక్చర్ అయోడిన్ లేదా డెటాల్ పూయాలి. ఇలా చేయటం వల్ల బొడ్డువాపుతో పాటు ఇతర వ్యాధులు లేగదూడలకు సోకకుండా నిరోధించవచ్చు.
పుట్టిన గంట వ్యవధిలో తల్లి వద్ద లేగదూడ జున్నుపాలు తాగించేలా చూడాలి. పుట్టిన దూడ కాస్త బలహీనంగా ఉన్నా, బరువు తక్కువగా ఉన్నట్లు గుర్తించినా విటమిన్ ఎ, డి, ఇ, ఐరన్ ఇంజక్షన్ రూపంలో లేదంటే నోటి ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది.
పుట్టిన పదిరోజుల వ్యవధిలో లేగదూడలు ఇతరత్రా వ్యాధులబారిన పడకుండా ఉండేందుకు తొలిరోజు ధనుర్వాతం రాకుండా టీటీ ఇంజన్షన్ , రెండో రోజు బి విటమిన్, టెట్రాసైక్లిన్ యాంటీ బయోటిక్ బిళ్ళలు లేదంటే పౌడర్ తాగించాలి. ఇలా చేయటం వల్ల విరోచనాలు వంటివి రాకుండా నివారించవచ్చు. 7 వరోజు ఎలికపాముల నిర్మూలనకు ఫైపర్ జిన్ అడిపేట్, అల్బెండోజోల్,ఫెన్ బెండజోల్ వంటి మందులను తాగించాలి.
లేగదూడలు పుట్టిన సందర్భంలో చేపట్టే ఈ స్వల్పకాలిక జాగ్రత్తల మూలంగా ఆరోగ్యంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు పాటిస్తే అవి పెరిగి పెద్దవై మేలు జాతి పాడి పశువులుగా మారి రైతులకు మంచి అదాయం సమకూర్చిపెడతాయి.
COMMENTS