మీ వెహికల్‌ను ట్రాకింగ్ చేస్తున్నారనే డౌట్ ఉందా ?
ట్రాకింగ్ అనే పదం వినగానే ఎవరో మనల్ని వెంబడిస్తున్నారు అనే ఆలోచన వస్తుంది. అలాంటిది పెద్ద పెద్ద రవాణా సంస్థలు కొన్ని వస్తువులను రహస్యంగా తరలించాల్సి ఉంటుంది. అయితే దారి దోపిడీదారులు ఇలాంటి వాహనాలను ట్రాక్ చేసి సంపదను కొల్లగొడుతుంటారు. దీని వలన చాలా వరకు సంస్థలు తీవ్ర స్థాయిలో నష్టపోతుంటారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు మార్కెట్లోకి సరికొత్త ఉత్పత్తి ఒకటి అందుబాటులోకి వచ్చింది.
వెహికల్ ట్రాకింగ్
రవాణా నిర్వహణ సిస్టమ్‌కు సంభందించి ఉత్పత్తులను తయారు చేసే ఫాస్ట్‌ట్రాకర్జ్ అనే సంస్థ వెహికల్ ట్రాకింగ్ చేసే సిస్టమ్‌ను అపివేసి మరియు రియల్ టైమ్ డాటాను పర్యవేక్షిస్తుంది. దీని పేరు ఎఫ్‌టి0007. లాడిస్టిక్స్ మరియు ట్రాన్స్‌పోర్టేషన్‌లో ఇది కీలక పాత్ర పోషించనుంది.
ఈ ఎఫ్‌టి0007 పరికరం జిపిఎస్ లేదా జిపిఎమ్ యాంటెన్నాలతో వచ్చింది, ఇది బ్యాటరీ ద్వారా పనిచేస్తుంది. ముందుగా నిర్ణయించబడిన రూటులో వెళ్లకపోయినా మరియు అధిక వేగంతో వెళ్లినా ఇందులోని అలారమ్ మోగుతుంది.
దీనిని ఎలాంటి వాహనాలలోనైనా అమర్చుకునేందుకు వీలుగా చిన్న పరిమాణంలో డిజైన్ చేసారు. మరియు మీ వాహనాన్ని ట్రాకింగ్ చేస్తున్నా మరియు మీకు సంభందం లేని మరే ఇతర ఎలక్ట్రిక్ వస్తువులు మీ వాహనం గురించి సమాచారం సేకరిస్తున్నా వాటన్నింటిని స్తంభింపజేస్తుంది. సరైన ధరకు మరియు అతి తక్కువ సమయంలో డెలివరీ చేస్తామని పాస్ట్‌ట్రాకర్జ్ డైరెక్టర్ అమిత్ కల్రా తెలిపాడు.
COMMENTS