Banana : అరటితోటల్లో అంతరపంటలతో అదనపు అదాయం
Banana : సాగు సమస్యలు పెరిగి పోతున్నాయి. దీనికి తోడు ఖర్చులు మిన్నంటుతున్నాయి. వచ్చే ఫలసాయం తక్కువగా ఉంటుంది. పకృతి వైపరిత్యాలు వ్యవసాయ మనుగడకు ఇబ్బందికరంగా మారాయి. ఇన్ని ఇక్కట్ల నడుమ వ్యవసాయం మనుగడ సాగించేందుకు వైవిధ్య భరిత సాగువైపు మళ్ళటం తప్ప రైతులకు మరో మార్గం లేదు. ఈ క్రమంలోనే రైతులు అంతర పంటల సాగువైపు ఆలోచిస్తున్నారు.
ఏడాది పొడవునా సాగుకు అరటి అనుకూలంగా ఉంటుంది. మంచి లాభసాటి పంటకావటంతో రైతులు అరటి పంటను సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అరటి తోటలో అంతర పంటలు సాగుచేస్తూ మెరుగైన దిగుబడులు పొందవచ్చు. వాతావరణ పరిస్ధితుల ప్రభావం కారణంగా ఒక్కో ఏడాది అరటి పంటకు నష్టం వాటిల్లే అవకాశాలు ఉంటాయి. అలాంటి సమయంలో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో అరటితోపాటు అంతరపంటల సాగును చేపడితే రైతుకు మేలు కలిగి అవకాశం ఉంటుంది.
అంతర పంటలసాగు ద్వారా రైతు అధిక అదాయాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. అనుకోని పరిస్ధితుల్లో వేసిన పంటల్లో ఒక దాంట్లో నష్టం వచ్చినా మరో దాని ద్వారా ఆనష్టాన్ని పూడ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అరటి ఏడాది పంట కావటంతో అరటి మధ్యలో శనగ, బొప్పాయి, నేల చిక్కడు, టమాటో, వంగ, వంటి కూరగాయ జాతి మొక్కలను సాగు చేసుకోవచ్చు. వీటితోపాటు కంద, క్యారెట్, బీట్ రూట్, క్యాలీఫ్లవర్, క్యాబేజి వంటి పంటలను అంతర పంటలుగా రైతులు అరటిలో సాగు చేపట్టవచ్చు.
ఇలా చేయటం వల్ల అదనపు ఆయాయంతోపాటు , అరటికి అయ్యే పెట్టుబడి ఖర్చులను ఈ అంతరపంటల ద్వారా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. వేసవి సమయంలో నీటి సదుపాయం ఉన్న పొలాల్లో అరటిలో అంతరపంటగా పుచ్చ, దోస వంటి తీగజాతి పంటను వేసుకుంటే అదనపు అదాయాన్ని రైతులు సమకూర్చుకోవచ్చు. ఇప్పటికే చాలా మంది రైతులు అరటిలో అంతరపంటలను సాగు చేస్తూ అదనపు అదాయాన్ని పొందుతున్నారు.
అరటిని ఏకపంటగా సాగు చేస్తే గెలలు వచ్చేందుకు చాలా సమయం పడుతుంది. దీంతో పెట్టుబడుల ఖర్చు పెరుగుతుంది. పంట చేతికి వచ్చే సమయం చాలా ఎక్కవగా ఉండటంతో ఈలోపు అరటిలో అంతర పంటల సాగు చేయటం ద్వారా అదాయాన్ని సమకూర్చుకోవచ్చు.
COMMENTS