Aqua Farmers: కేజ్ కల్చర్ ను ప్రోత్సహిస్తోన్న CMFRI – పంపానో, పండుగప్ప చేపల పెంపకంతో లాభాలు
Aqua Farmers: ఆక్వాపరిశ్రమ దిన దినాభివృద్ది చెందుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా చేపల పెంపకాన్ని కూడా మర్చుతున్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని పొందేందుకు కేజ్ కల్చర్ విధానాన్ని పాటిస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల ఈ విధానాన్ని చేపట్టి మంచి దిగుబడులను పొందుతున్నారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లాకు చెందిన కొందరు రైతులు కృష్ణానది బ్యాక్ వాటర్ లో కేజ్ కల్చర్ లో పంపానో, పండుగప్ప చేపల పెంపకం చేపట్టి లాభాలను ఆర్జిస్తున్నారు.
చూడటానికి నీటిపై తేలియాడుతున్న జాలీ హౌజ్ లు మాత్రమే కనిపిస్తాయి. దీనినే కేజ్ కల్చర్ అంటారు. అతి తక్కువ ఖర్చుతో, సాగునీటి ప్రాజెక్టుల్లో చేపల పెంపకం చేపట్టే విధానమింది. విశాఖలోని కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన కేంద్రం (సి.ఎం.ఎఫ్.ఆర్.ఐ.)వారు సముద్రం చేపైన పంపానో , పండుగప్ప చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగానే నీటి ప్రాజెక్టులు ఉన్న ప్రాంతాల్లో ఔత్సాహిక రైతులను ఎంపిక చేసి, వారికి చేపపిల్లలు, ఫీడ్ తో పాటు కేజ్ కల్చర్ కు సంబంధించిన సామాగ్రిని అందిస్తున్నారు.
ఇప్పటికే చాలామంది రైతులు వీటి పెంపకాన్ని చేపట్టి మంచి లాభాలను ఆర్జించారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లా, నాగాయలంక మండలం, పెదపాలెం గ్రామానికి చెందిన కొంత మంది రైతులు కృష్ణా నది బ్యాక్ వాటర్ లో కేజ్ లను ఏర్పాటు చేసి అందులో పంపానో, పండుగప్ప చేపల పెంపకం చేపట్టారు.
రైతులు ప్రతి ఏడాది డిసెంబర్ నెలలో కేజ్ లలో చేపపిల్లను వదులుతారు. జులై, ఆగస్టు నెలలో కృష్ణా నదికి వరదలు వస్తుంటాయి. వీటి కారణంగా రైతులు జూన్ నెలలోనే చేపలు పడుతుంటారు. వచ్చిన దిగుబడికి కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన కేంద్రం వారే మార్కెటింగ్ చేయిస్తుండటంతో రైతులకు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు.
COMMENTS