ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ మేళాకు సంబంధించి అధికారులు ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ Dr.Reddy’s ల్యాబ్ లో ఉద్యోగాల భర్తీకి ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ మేళాకు (Job Mela) సంబంధించి అధికారులు ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ Dr.Reddy’s ల్యాబ్ లో ఉద్యోగాల భర్తీకి ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (APSSDC Job Mela Registration) చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 14న ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
ప్రముఖ Dr.Reddy’s ల్యాబ్ లో అప్రంటీస్ ఖాళీల భర్తీకి ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. మెకానికల్/ఇన్స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రికల్ విభాగాల్లో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. పురుషులు/స్త్రీలు ఎవరైనా ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల కనీస వయస్సు 18 ఏళ్లు. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి ఏడాదికి రూ.2 లక్షల వేతనం ఉంటుంది. రూ.లక్ష వరకు కవర్ అయ్యే ఇన్సూరెన్స్ సదుపాయం ఉంటుంది. అభ్యర్థులు తెలుగు, ఇంగ్లిష్ భాషలను చదవడం, రాయడం మరియు మాట్లాడడం వచ్చి ఉండాలి.
అభ్యర్థులు ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ (https://apssdc.in/industryplacements/) చేసుకోవాల్సి ఉంటుంది.
-రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, కంచర్లపాలెం, విశాఖపట్నం చిరునామాలో ఈ నెల 14న ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
-రాత పరీక్ష, హెచ్ఆర్ రౌండ్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
- ఎంపికైన అభ్యర్థులు వైజాగ్, పైడిభీమవరం, హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది.
- అభ్యర్థులకు రాయితీపై క్యాంటీన్, ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉంటుంది.
- అభ్యర్థులు డేట్ ఆఫ్ బర్త్ లేదా టెన్త్ సర్టిఫికేట్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, టెన్త్ మరియు డిప్లొమా మార్క్స్ షీట్ తీసుకురావాల్సి ఉంటుంది.
COMMENTS