ఏపీ పాలిటెక్నిక్ కామన్ ప్రవేశ పరీక్ష - పాలిసెట్ - 2022 – కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల
రాష్ట్రంలో పాలిటెక్నిక్ కళాశాల ల్లో చేరికలకు అడ్మిషన్ల షెడ్యూల్ శనివారం విడుదలైంది. ఈ నెల 24న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఏపీ పాలిసెట్ కు 1,31,608 మంది హాజరు కాగా 1,20,867 మంది క్వాలిఫై అయ్యారు. పాలిసెట్ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అడ్మిషన్ల షెడ్యూల్ ఖరారు చేశారు.
జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. జూలై 29 నుంచి ఆగస్టు 5 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఆగస్టు 6 నుంచి 11 వరకు వెబ్ ఆపన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. 12న ఆపన్ల సవరణ చేసుకోవచ్చు. 16న సీట్ల కేటాయింపు చేస్తారు. ఆగస్టు 17 నుంచి 21 వరకు సెల్స్ రిపోర్టింగ్ తో పాటు కాలేజీలో రిపోర్ట్ చేయాలి. అదే నెల 22 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. కాగా సర్టిఫికెట్ల పరిశీలనకు 34 హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. ఇతర సమాచారం కోసం 7995681678 లేదా 7995865456 నంబర్లలో సంప్రదించాలి.
ముఖ్యమైన తేదీలు:
ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు తేదీలు: 27.07.22 నుండి 02.08.2022 వరకు
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలు: 29.07.22 నుండి 05.08.2022 వరకు
ఆప్షన్ల నమోదు తేదీ: 06.08.22 నుండి 11.08.22 వరకు
ఆప్షన్ల సవరణ తేదీ: 08.08.2022
సీట్ల కేటాయింపు తేదీ: 16.08.2022
APPOLYCET 2022 Admissions Important download Links:
APPOLYCET-2022 Detailed Notification
Annexure-I (Schedule for certificate verification for SC/BC/OC candidates)
Annexure-II (Schedule for certificate verification for ST candidates)
PH Special Category Priorities
CAP Special Category Priorities
NCC Special Category Priorities
Sports & Games Special Category Details
COMMENTS