Alasanda Cultivation : అలసంద సాగులో తెగుళ్ళు…మెళుకువలు
Alasanda Cultivation : అలసందల సాగుకు తేమను పట్టి ఉంచుతూ, మురుగు నీరు నిలువని మధ్యస్థ నేలలు అనుకూలంగా ఉంటాయి. చెల్క నేలలు, ఎర్ర భూములు, నల్లరేగడి భూముల్లో కూడా అలసందలు విరగ కాస్తాయి. వేసవిలో దిగుబడి పొందాలనుకొంటే, ఫిబ్రవరిలో విత్తుకోవాలి. ప్రస్తుతం అనేక రకాల హైబ్రిడ్ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. పంటకాలంతోపాటు దిగుబడిని, తెగుళ్లను తట్టుకొనే వాటిని ఎంచుకోవడం వల్ల లాభం ఉంటుంది. బొబ్బర్ల 196 కంటే ఎక్కువ వెచ్చని ఉష్ణోగ్రతలలో ఉత్తమంగా పెరుగుతాయి. బొబ్బర్ల ఎదుగుదలకు వెచ్చని వాతావరణ పరిస్థితులు అవసరం. పంట నీడ ప్రాంతాల కింద బాగా పెరగదు. పొడి మరియు తేమ వాతావరణంలో అవి సమానంగా పెరుగుతాయి.
ఒక ఎకరాలో అలసంద సాగు చేయాలంటే 8 నుంచి 10 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. అదే అంతర పంటగా సాగు చేయాలంటే 3 నుంచి 4 కిలోల వరకు సరిపోతాయి. సాళ్ల మధ్య 45 సెంటి మీటర్లు మొక్కల మద్యల 20 సెంటిమీటర్లు ఉందేలా విత్తుకొవాలి. నాగలితో గాని గొర్రుతో గాని విత్తుకోవాలి.
అలసంద విత్తనరకాలు ; జీసీ-3 ఇది స్వల్పకాలిక రకం. పంటకాలం 90-95 రోజులు. ఎకరానికి 4-5 క్వింటాళ్ల దిగుబడిని ఇస్తుంది. పల్లాకు తెగులును సమర్థంగా తట్టుకొంటుంది. వీ-240 ఈ రకం గింజలు ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. 90-100 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరానికి 5-6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ రకం అన్ని రకాల తెగుళ్లను తట్టుకొంటుంది. పశుగ్రాసానికి అనుకూలంగా ఉంటుంది.
సీ-152 పండ్లతోటల్లో అంతర పంటగా వేయడానికి ఈ రకం అనుకూలం. పంటకాలం 105-110 రోజులు. ఎకరానికి 3-4 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. గింజలు తెలుపు రంగులో ఉంటాయి. కో-4 ఇది నల్ల గింజలను అందించే రకం. 90-100 రోజులు పంటకాలం. ఎకరానికి 3-4 క్వింటాళ్ల దిగుబడిని సాధించవచ్చు. విత్తనాలతో పాటు పశుగ్రాసానికీ అనుకూలంగా ఉంటుంది.
అలసంద సాగులో ఆశించే తెగుళ్లు ;
చిత్త పురుగులు : పైరు రెండు ఆకుల దశలో ఉన్నప్పుడు ఈ పురుగులు ఆకులపై రంగులు చేసి నష్టపరుస్తాయి. వీటి వల్ల మొక్క బలహీనపడి పెరుగుదల ఆగిపోతుంది. చిత్త పురుగుల నివారణకు ఇమిడాక్లోప్రిడ్ మిల్లీలీటర్ మందుతో కిలో విత్తనాలను శుద్ధి చేసుకోవాలి. క్లోరోఫైరిఫాస్ 2 మిల్లీలీటర్ గానీ ఎసిఫేట్ 1.5 గ్రాముల మందును గానీ లీటరు నీటికి కలిపి పంటకు పిచికారీ చేయాలి.
పేనుబంక : పేనుబంకతో అలసందకు ఎక్కువ నష్టం కలుగుతుంది. ఈ పురుగులు మొక్కల అన్ని భాగాలనూ ఆశించి రసం పీల్చి, ఎదుగుదలను తగ్గిస్తాయి. నివారణకు ఇమిడాక్లో ప్రిడ్ గానీ కార్డ్బోసల్ఫాన్ మందుతో విత్తనశుద్ధి చేయాలి. పైరులో పేనుబంకను గమనిస్తే డైమిథోయేట్ 2.0 మి.లీ. గానీ, మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
పౌడర్లీ మిల్డో : ఆకులపై ఉపరితలాలపై తెల్లటి పొడి ఫంగస్ ఎదుగుతుంది. ఆకులపై క్లోరోటిక్ లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. మొక్క నుండి ఆకులు రాలిపోతాయి. మొక్కల చుట్టూ మంచి గాలి ప్రసరించేలా మొక్కకు మొక్కకు మధ్య ఎడం ఉండేలా చూసుకోవటం మంచిది.
వేరుకుళ్లు తెగులు ; ఈ తెగులు సోకిన మొక్కలు, ఆకుల వాడిపోయి ఎండిపోతాయి. విత్తిన 3 వారాల్లో ఎండిపోయిన మొక్కలు పొలంలో పలచగా అక్కడక్కడా కనిపిస్తాయి. ట్రైకోడెర్మావిరిడీ 4 గ్రాములు, థైరామ్ 3 గ్రాములను కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేసుకుంటే వేరుకుళ్లు రాకుండా చేయవచ్చు. వేరుకుళ్లు సోకితే కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3.0 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్లు తడిసేలా పోయాలి.
COMMENTS