ఐబీపీఎస్ 8106 పోస్టులకు నోటిఫికేషన్
IBPS RRB Notification 2022: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) రీజినల్ రూరల్ బ్యాంకుల్లో (RRB) కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్-XI (సీఆర్పీ) ద్వారా ఆఫీసర్లు, ఆఫీస్ అసిస్టెంట్(మల్టీపర్పస్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 8106 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 27 వరకు ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు.
పూర్తి వివరాల్లోకెళ్తే..
ముఖ్య సమాచారం:
ఐబీపీఎస్-సీఆర్పీ ఆర్ఆర్బీ XI
మొత్తం ఖాళీలు: 8106 పోస్టులు
పోస్టులు: ఆఫీసర్లు, ఆఫీస్ అసిస్టెంట్లు (మల్టీపర్పస్)
అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ, ఎంబీఏ, లా తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. అధిక శాతం ఉద్యోగాలు డిగ్రీ అర్హతతో ఉన్నాయి.
ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), సూచించిన పోస్టులకు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
విభాగాల వారీగా ఖాళీలు:
Office Assistants (Multipurpose)- 4483
Officer Scale I - 2676
Officer Scale II (Agriculture Officer) - 12
Officer Scale II (Marketing Officer)- 06
Officer Scale II (Treasury Manager)- 10
Officer Scale II (Law)- 18
Officer Scale II (CA)- 19
Officer Scale II (IT)- 57
Officer Scale II (General Banking Officer)- 745
Officer Scale III- 80
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్ 07, 2022
దరఖాస్తులకు చివరి తేది: జూన్ 27, 2022
ఆన్లైన్ ఎగ్జామినేషన్ (ప్రిలిమినరీ): ఆగస్టు 2022
ఆన్లైన్ ఎగ్జామినేషన్ (మెయిన్): సెప్టెంబరు/ అక్టోబరు 2022
IBPS RRB APPLY ONLINE
COMMENTS