DRDO - RAC లో 630 సైంటిస్ట్ ఉద్యోగాలు..
DRDO-RAC Scientist B Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని డీఆర్డీఓ – రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ (DRDO – RAC).. సైంటిస్ట్ ‘బీ’ (Scientist B Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 630
పోస్టుల వివరాలు: సైంటిస్ట్ ‘బీ’ పోస్టులు
ఖాళీల వివరాలు:
డీఆర్‌డీఓ పోస్టులు: 579
ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) పోస్టులు: 43
డీఎస్‌టీ పోస్టులు: 8
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజినీరింగ్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ఎమ్మెస్సీలోఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: పోస్టును బట్టి రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
జనరల్/ఓబీసీ/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు: రూ. 100
ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తులకు చివరి తేది: నోటిఫికేషన్ వెలువడిన 21 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలి (జులై 14, 2022).
రాత పరీక్ష తేదీ: అక్టోబర్ 16, 2022.
For FULL DETAILS CLICKHERE
COMMENTS