Bhagat Singh Biography(Revolutionary)
భయమెరుగని భారతీయుడు భగత్‌సింగ్.అంతులేని ధైర్యానికి కొలమానం. ఉరితాడుతో ఉయ్యాలలూగిన భారత తేజం. ఆ విప్లవవీరుడి పేరు లేకుండా భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రే లేదు.
ఆ... యోధుడి పేరు వింటేనే రోమాలు నిక్కబొడుస్తాయి. బ్రిటీష్ అధికారులు సైతం తమకు తెలియకుండానే శాల్యూట్ చేస్తారు. పన్నెండేళ్లకే ఆ వీరుడు భరతజాతి విముక్తి కోసం కంకణం కట్టాడు. పద్నాలుగేళ్లకే భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అడుగులేశాడు. ఇరవైమూడేళ్లకే బలిదానం చేసి యువతరంలో జ్వాలను రగిల్చాడు. ఆయనే భగత్‌సింగ్. ఆయన జయంతి సెప్టెంబర్ 28.
భగత్ సింగ్.. దేశభక్తికి ప్రతిరూపం.
భగత్ సింగ్...ధైర్యానికి ప్రతీక. దేశభక్తికి ప్రతిరూపం.
భగత్ సింగ్ ...ధీరత్వానికి మారుపేరు. నవతరానికి ఒక స్ఫూర్తి. భయమెరుగని భారతీయుడు భగత్‌సింగ్.
అంతులేని ధైర్యానికి కొలమానం. ఉరితాడుతో ఉయ్యాలలూగిన భారత తేజం. ఆ విప్లవవీరుడి పేరు లేకుండా భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రే లేదు.
1907 సెప్టెంబర్ 28న నేటి పాకిస్తాన్‌లోని లాయల్‌పూర్ జిల్లా బంగాలో... ఆ విప్లవ వీరుడికి కిషన్ సింగ్, విద్యావతి దంపతులు జన్మనిచ్చారు.
భారత్‌లో బ్రిటీషు పాలన ను వ్యతిరేకిస్తూ విప్లవాత్మక ఉద్యమాలను చేపట్టిన కుటుంబంలో ఆయన జన్మించాడు.
యుక్త వయస్సులోనే ఐరోపా విప్లవ ఉద్యమాలను గురించి చదివిన సింగ్ అరాజకవాదం మరియు సామ్యవాదమునకు ఆకర్షితుడయ్యాడు.అనేక విప్లవాత్మక సంస్థల్లో ఆయన చేరాడు. హిందూస్తాన్ గణతంత్ర సంఘం (HRA)లో ఒక్కో మెట్టు ఎక్కుతూ అనతికాలంలోనే అందులోని నాయకుల్లో ఒకడుగా ఎదిగిన ఆయన ఆ తర్వాత దానిని హిందూస్తాన్ సామ్యవాద గణతంత్ర సంఘం (HSRA)గా మార్చాడు. భారత మరియు బ్రిటన్ రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జైలులో 64 రోజుల నిరాహారదీక్షను చేపట్టడం ద్వారా సింగ్ విపరీతమైన మద్దతును కూడగట్టుకున్నాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజ్‌పత్ రాయ్హత్య నేపథ్యంలో ఒక పోలీసు అధికారిని కాల్చినందుకు ఆయన్ను ఉరితీశారు. ఆయన ఉత్తరదాయిత్వం భారత స్వాతంత్ర్య సిద్ధికి పోరాడేలా భారత యువతను ప్రేరేపించింది. అంతేకాక భారత్‌లో సామ్యవాద వ్యాప్తి మరింత పుంజుకుంది.
12 ఏళ్ల వయసులో బ్రిటీష్ పాలకులపై కసి ఉరకలేస్తున్న యవ్వనాన్ని దేశానికి అంకితం చేశాడు. పరవళ్లు తొక్కే పౌరుషాన్ని స్వాతంత్ర్యం సాధించుకునేందుకు పణంగా పెట్టాడు. 12 ఏళ్ల వయసులోనే జలియన్ వాలాబాగ్ దారుణాలను చూసి భగత్‌సింగ్ రగిలిపోయాడు. సామ్రాజ్యవాద బ్రిటీష్ పాలకులపై కసి పెంచుకున్నాడు. 14 ఏళ్ల ప్రాయంలోనే మహాత్ముడి పిలుపుతో సహాయ నిరాకరణ ఉద్యమంలోకి దూకాడు. గాంధీ అకస్మాత్తుగా సహాయనిరాకరణ ఉద్యమాన్ని నిలిపేయడం భగత్‌సింగ్‌కు నచ్చలేదు. అందుకే తన పంథాలోనే పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. తనకు నచ్చే వేదికలను వెదుక్కున్నాడు. 1926లో నవజవాన్ భారత్ సభ అనే మిలిటెంట్ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ అనే సంస్థను స్థాపించి స్వాతంత్య పోరాటాన్ని కొనసాగించాడు.
1928లో సైమన్ కమీషన్‌కు వ్యతిరేకంగా ఉద్యమం
1928లో సైమన్ కమీషన్ వచ్చినప్పుడు పోలీసుల దాడిలో... లాలాలజపతిరాయ్ చనిపోవటం తో భగత్‌సింగ్ నెత్తురు ఉడికిపోయింది. సహచరులతో కలిసి జాతీయ అసెంబ్లీలో బాంబులు వేయాలన్న ప్లాన్ వేశారు. విజిటర్స్ గ్యాలరీ నుండి బాంబులు వేసి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ కరపత్రాలు వెదజల్లారు.
1931 మార్చి 23న లాహోర్‌లో ఉరితీత బ్రిటీష్ హై కమిషనర్ సాండర్స్‌ను కాల్చి చంపాడనే అభియోగం కింద భగత్‌సింగ్‌తో పాటు రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను 1931 మార్చి 23న లాహోర్‌లో ఉరితీశారు. అనంతరం అత్యంత పాశవికంగా భగత్‌సింగ్ మృతదేహాన్ని తెగ నరికి దహనం చేశారు. కానీ భగత్‌సింగ్ ఎవరిని చంపలేదని సాక్షాత్తు పాకిస్ధాన్ పోలీస్ శాఖ లాహోర్ న్యాయస్ధానానికి తెలిపింది. దీన్ని బట్టి చూస్తే పోరాటయోధుడిని కావాలనే బ్రిటిష్ ప్రభుత్వం హత్య చేసిందని తెలుస్తోంది. ఉరిని తప్పించుకునే అవకాశం ఉన్నా... తన ఉరి దేశ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని పెంచుతుందని చావును ఆహ్వానించాడు.
భగత్‌సింగ్‌ను పొట్టనపెట్టుకున్న బ్రిటీష్ పాలకులు చరిత్ర వీరుల్ని, విప్లవ ధీరుల్ని పుట్టిస్తుంది. అలాంటి పోరాట యోధుడే భగత్‌సింగ్. భరతమాత సంకెళ్లను తెంచేందుకు, ఉరితాడునే పూమాలగా మెడలో వేసుకున్న ధైర్యశాలి. త్యాగం, ఆదర్శానికి ఆయన నిదర్శనం. అదే నేటి వెలుగు దారి.
భగత్ సింగ్ మూడేళ్ళ పిల్లాడిగా ఉన్నప్పుడు అతని తండ్రి కిషన్ సింగ్ భగత్ సింగ్‌ను చంకకెత్తుకొని, తన స్నేహితుడు నందకిశోర్ మెహతాతో పాటు కొత్తగా వేస్తున్న తోటను చూడ్డానికి పొలాల్లోకి వెళ్ళాడు. వెంటనే కిందికి దిగిన భగత్ సింగ్ ఆ మట్టిలో ఆడుకుంటూనే చిన్న చిన్న గడ్డిపరకలను నాటడం మొదలు పెట్టాడు. తండ్రి " ఏం చేస్తున్నావ్ నాన్నా" అని ప్రశ్నిస్తే, భగత్ సింగ్ ఇచ్చిన జవాబు విని వాళ్ళు అవాక్కయ్యారు. భగత్ సింగ్ అన్న మాటలు ఇవి " తుపాకులు నాటుతున్నా". భవిష్యత్తుకు బాల్యమే మొలక. మొలకలు వేసే వయస్సులో తుపాకులను మొలకెత్తించాలని చూడడం అతని వ్యక్తిత్వానికి మచ్చుతునక.
విద్యార్థి దశలో స్కూల్లో కూడా ఆటపాటల్లోనే కాదు అందరితో కలివిడిగా ఉండేవాడు భగత్ సింగ్. బాబాయి సర్దార్ అజిత్ సింగ్ ఆంగ్లేయులతో పోరాడుతూ విదేశాల్లో ఉంటున్న సమయంలో, కంట నీరు పెట్టుకొనే చిన్నమ్మ హర్నామ్ కౌర్ ను చూసి నాలుగేళ్ళ భగత్ సింగ్ " పిన్నీ ఏడవొద్దు. నేను ఆంగ్లేయులపై ప్రతీకారం తీర్చుకుంటా" అని ప్రతిజ్ఞలు చేసేవాడు.
13 ఏళ్ల ప్రాయంలోనే మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమానికిసింగ్ ప్రభావితుడయ్యాడు. ఆ సమయంలో బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురుతిరిగిన భగత్ ప్రభుత్వ పాఠశాల పుస్తకాలు మరియు బ్రిటీషు దిగుమతి దుస్తులను తగులబెట్టడం ద్వారా గాంధీ సిద్ధాంతాలను అనుసరించాడు. ఉత్తరప్రదేశ్ లోని చౌరీ చౌరా గ్రామస్తులు పోలీసులను హింసాత్మకంగా హతమార్చిన నేపథ్యంలో ఉద్యమాన్ని గాంధీ ఉపసంహరించుకున్నాడు. ఆయన అహింసావాదంపై అసంతృప్తి చెందిన సింగ్ యువ విప్లవోద్యమంలో చేరి, తెల్లదొరలకు వ్యతిరేకంగా హింసాత్మక ఉద్యమాన్ని ఉధృతం చేశాడు.
లాలా లజ్‌పత్ రాయ్ మరణం మరియు సాండర్స్ హత్య 1928లో భారత్‌లోని వర్థమాన రాజకీయ పరిస్థితిపై నివేదికను కోరుతూ సర్ జాన్ సైమన్ నేతృత్వంలో బ్రిటీష్ ప్రభుత్వం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే కమిషన్ సభ్యుడిగా ఒక్క భారతీయుడిని కూడా నియమించకపోవడంతో భారత రాజకీయ పార్టీలు దానిని బహిష్కరించాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా పలు నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. 30 అక్టోబరు 1928న కమిషన్ లాహోర్‌ను సందర్శించినప్పుడు సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా లాలా లజ్‌పత్ రాయ్ నేతృత్వంలో నిశ్శబ్ద అహింసా పద్ధతిలో ఒక నిరసన కార్యక్రమం జరిగింది. అయితే హింస తలెత్తడానికి పోలీసులు కారణమయ్యారు.లాలా లజ్‌పత్ రాయ్ ఛాతీపై పోలీసులు లాఠీలతో కొట్టారు.దాంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనను కళ్లారా చూసిన భగత్ సింగ్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. పోలీసు అధికారి స్కాట్‌ను హతమార్చడానికి విప్లవకారులు శివరామ్ రాజ్‌గురు, జై గోపాల్ మరియ సుఖ్‌దేవ్ థాపర్‌లతో ఆయన చేతులు కలిపాడు. స్కాట్‌ను గుర్తించిన జై పాల్ ఆయన్ను కాల్చమంటూ సింగ్‌కు సంకేతాలిచ్చాడు. అయితే పొరపాటు గుర్తింపు కారణంగా డీఎస్పీ J. P. సాండర్స్ కనిపించినప్పుడు సింగ్‌కు జై పాల్ సంకేతమిచ్చాడు. ఫలితంగా స్కాట్‌కు బదులు సాండర్స్ హతమయ్యాడు. దాంతో పోలీసుల కంట పడకుండా ఉండటానికి భగత్ లాహోర్ పారిపోయాడు. గుర్తు పట్టకుండా ఉండటానికి గడ్డాన్ని గీసుకోవడం, వెండ్రుకలు కత్తిరించుకోవడం ద్వారా సిక్కు మత విశ్వాసాల ఉల్లంఘనకు సింగ్ పాల్పడ్డాడు.
విప్లవకారుల చర్యలను అణచివేసే దిశగా భారత రక్షణ చట్టమును తీసుకురావడం ద్వారా పోలీసులకు బ్రిటీష్ ప్రభుత్వం మరింత అధికారం కల్పించింది.భగత్ సింగ్ వంటి విప్లవకారులను అణచివేయడం ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్ధేశ్యం. ఆ తర్వాత ప్రజాహితం కోసమేనంటూ ప్రత్యేక శాసనం కింద ఈ చట్టాన్ని ఆమోదించారు. ఆయితే ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అది ఆమోదితం కానున్న కేంద్ర శాసనసభపై బాంబు పేలుడుకు హిందూస్తాన్ సామ్యవాద గణతంత్ర సంఘం వ్యూహరచన చేసింది. బాంబు పేలుడుకు భగత్ సింగ్ ప్రయత్నించకుండా మరో ప్రముఖ విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్ అడ్డుకున్నాడు. అయితే సింగ్ ఆశయాలను అంగీకరించే విధంగా మిగిలిన పార్టీ సభ్యులు ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చారు. అసెంబ్లీపై భగత్ సింగ్‌తో పాటు మరో విప్లవకారుడు8 ఏప్రిల్ 1929న అసెంబ్లీ వసారాలపై సింగ్ మరియు దత్‌లు బాంబు విసిరి, "ఇంక్విలాబ్ జిందాబాద్!భగత్ సింగ్ రిమంబర్డ్ - డైలీ టైమ్స్ పాకిస్తాన్దీ-ని తర్వాత వినికిడి శక్తి కోల్పోయేలా గొంతెత్తి అరుస్తామని ముద్రించబడిన పలు కరపత్రాలను వెదజల్లారు. అసెంబ్లీ ఆవరణలో కరపత్రం విసిరివేత'బాంబు దాడి వల్ల ఏ ఒక్కరూ మరణించడం గానీ గాయపడటం గానీ జరగలేదు. తమ వ్యూహంలో భాగంగా ఉద్ధేశ్యపూర్వకంగానే జాగ్రత్తలతో దాడి చేసినట్లు సింగ్, దత్ అంగీకరించారు. బాంబు గాయపరిచేటంత శక్తివంతమైంది కాదని బ్రిటీష్ ఫోరెన్సిక్స్ విచారణాధికారులు కూడా తేల్చిచెప్పారు. వాస్తవానికి బాంబు జనాలకు దూర బాంబు దాడి తర్వాత సింగ్, దత్ ఇద్దరూ లొంగిపోయారు. 12 జూన్ 1929న సింగ్ మరియు దత్ 'జీవితకాల దేశ బహిష్కరణ'కు గురయ్యారు.
సింగ్ అరెస్టు అనంతరం అసెంబ్లీ పేలుడుపై విచారణ నేపథ్యంలో J. P. సాండర్స్ హత్య వెనుక ఆయన హస్తంపై బ్రిటీష్ ప్రభుత్వం ఆరా తీసింది. హత్యకు సంబంధించి భగత్సింగ్, రాజ్‌గురుమరియు సుఖ్‌దేవ్‌లపై అభియోగాలు మోపారు. భారత స్వాతంత్ర్యానికి తన గళాన్ని వినిపించుకునేందుకు కోర్టునే ఒక ప్రచార వేదికగా మలుచుకోవాలని భగత్ సింగ్ నిర్ణయించుకున్నాడు. హత్యా నేరాన్ని అంగీకరించిన ఆయన విచారణ సమయంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశాడు. విచారణ సమయంలో HSRA సభ్యులు లేకుండా కేసు విచారణ కొనసాగించాలని ఆదేశించారు. తద్వారా సింగ్ తన భావాలను ఇక ఎప్పుడూ ప్రచారం చేయలేడనే ఆవేదనతో ఆయన మద్దతుదారులు తీవ్రంగా మండిపడ్డారు.
ఖైదీలు మరియు విచారణ ఖైదీల హక్కుల కోసం భగత్ సింగ్ మరియు ఇతర ఖైదీలు జైలులోనే నిరాహారదీక్ష చేపట్టారు. చట్టం ప్రకారం ఉత్తమ హక్కులు కల్పించాల్సిన భారత రాజకీయ ఖైదీల కంటే బ్రిటీష్ హంతకులు మరియు దొంగలకు ప్రాధాన్యత ఇవ్వడం దీక్షకు దారితీసింది. రాజకీయ ఖైదీలకు పౌష్టికాహారం, పుస్తకాలు, దినపత్రికల సదుపాయం, మంచి బట్టలు, టాయిలెట్ ఇతర దైనందిన సదుపాయాలు కల్పించడం వారి డిమాండ్లు. అలాగే కార్మిక లేదా హోదాకు తగని పనిచేసే విధంగా రాజకీయ ఖైదీలపై ఒత్తిడి తీసుకురాకూడదని సింగ్ డిమాండ్ చేశాడు.63 రోజుల పాటు కొనసాగిన నిరాహారదీక్ష సింగ్ డిమాండ్లకు బ్రిటీష్ ప్రభుత్వం తలొగ్గడం ద్వారా ముగిసింది. తద్వారా ఆయనకు సాధారణ భారతీయుల్లో ఆదరణ పెరిగింది. దీక్షకు ముందు ఆయన ప్రాభవం ప్రధానంగా పంజాబ్ ప్రాంతం వరకే పరిమితమైంది.
కేంద్ర శాసనసభపై బాంబు దాడి జరిగినప్పుడు అక్కడున్న రాజకీయ నాయకుల్లో ఒకరైన మహ్మద్ అలీ జిన్నా లాహోర్ ఖైదీలకు బహిరంగంగానే తన సానుభూతి తెలిపాడు. నిరాహారదీక్షపై మాట్లాడుతూ "నిరాహారదీక్ష చేసే వ్యక్తిలో ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మతోనే తను ముందుకు సాగుతాడు. తన పోరాటానికి న్యాయం జరుగుతుందని విశ్వసిస్తాడు" అని వ్యాఖ్యానించాడు. సింగ్ చర్యలపై మాట్లాడుతూ, "ఏదేమైనప్పటికీ, వారిని ఎక్కువగా నిందించినా మరియు ఎక్కువగా చెప్పినా వారు తప్పుదోవ పడుతారు. తద్వారా ఏర్పడే పాలనా ధిక్కార వ్యవస్థను ప్రజలు చీదరిస్తారు" అని అన్నాడు.
డైరీని వ్రాసే అలవాటు ఉన్న భగత్ సింగ్ చివరకి 404 పుటలను నింపాడు. తాను సమర్థించే పలువురు ప్రముఖుల ఉల్లేఖనాలు మరియు వారి గొప్ప వాక్యాలకు సంబంధించి సింగ్ తన డైరీలో పలు సూచనలు చేశాడు. అందులో కార్ల్ మార్క్స్ మరియు ఫ్రెడ్రిచ్ ఏంజిల్స్ ఆలోచనలను ప్రముఖంగా ప్రస్తావించాడు.భగత్ సింగ్ డైరీలోని పలు వ్యాఖ్యలు ఆయన విశిష్టమైన దార్శనిక అవగాహనకు అద్దం పడుతాయి. "దేవుడిపై విశ్వాసం లేని అహంకారి అనిపించుకున్న సింగ్ మరణానికి ముందు కూడా నేను ఎందుకు నాస్తికుడనయ్యాను?" అనే శీర్షికతో ఒక వ్యాసాన్ని రాశాడు.
23 మార్చి 1931న భగత్ సింగ్‌తో పాటు ఆయన సహచరులు రాజ్‌గురు మరియు సుఖ్‌దేవ్‌లను లాహోర్‌లో ఉరితీశారు. సింగ్ ఉరిని వ్యతిరేకిస్తూ నిరసన చేపడుతున్న ఆయన మద్దతుదారులు ఆయన్ను ఆ క్షణమే షహీద్ లేదా అమరవీరుడుగా ప్రకటించారు.
అప్పటి సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ V.N. స్మిత్ ప్రకారం, సింగ్‌ను ముందుగానే ఉరితీశారు:
సాధారణంగా ఉదయం 8 గంటలకు ఉరితీసేవారు. అయితే ఏమి జరిగిందో ప్రజలు తెలుసుకునే లోగానే ఆయన్ను ఉరితీయాలని నిర్ణయించారు...సుమారు రాత్రి 7 గంటల ప్రాంతంలో జైలు లోపల నుంచి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు వినిపించాయి. సింగ్ జీవితానికి చివరగా తెర దించబోతున్నారన్న విషయానికి అది సంకేతమయింది.
సట్లెజ్ నది ఒడ్డున ఉన్న హుస్సేనివాలా వద్ద సింగ్‌ను దహనం చేశారు. భగత్ సింగ్ స్మారకచిహ్నం నేడు భారత స్వాతంత్ర్య సమరయోధులను గుర్తుకు తెస్తుంది.
"బ్లడ్ స్ప్రింక్లెడ్ ఆన్ ది డే ఆఫ్ హోలీ బాబర్ అకాలిస్ ఆన్ ది క్రుకిఫిక్స్" వంటి ఆయన రాసిన పలు రచనలు ధరమ్ సింగ్ హయత్‌పూర్ పోరాటం చేత ప్రభావితమయ్యాయి.
అసెంబ్లీ పై బాంబు విసిరేసిన సంఘటనకి కాస్త ముందుగా తన సహచరుడు సుఖ్‌దేవ్‌కు వ్రాసిన లేఖలో భగత్ సింగ్ " నాకూ ఆశలూ, ఆకాంక్షలూ ఉన్నాయి. ఆనందమైన జీవనం గడపాలని ఉంది. అయితే అవసరమొచ్చినప్పుడు వీటన్నిటినీ త్యజించగలను. ఇదే అసలైన బలిదానం."
(ENGLISH VERSION)
Bhagat Singh Biography(Revolutionary)
Bhagat Singh was an Indian revolutionary who played a pivotal role in the Indian Independence movement against British colonial rule. Born into a family of patriotic Sikhs well-known for their participation in revolutionary activities against the British rule, Bhagat Singh was inspired greatly by the courage of his father and uncles. As a young man, he became attracted to anarchist and Marxist ideologies which further kindled revolutionary ideas in him. Bright and intelligent, he was also an avid reader and actively participated in extra-curricular activities as a college student. He was involved with several revolutionary organizations, including the ‘Hindustan Republican Association’ (HRA), which changed its name to ‘Hindustan Socialist Republican Association’ (HSRA) in 1928. He had great respect for Lala Lajpat Rai, who was injured in a protest against the ‘Simon Commission.’ When Rai died a few days later, Singh decided to avenge his death and assassinated John Saunders, a British police officer. Evading arrest, he went on to hurl bombs inside the ‘Central Legislative Assembly’ before allowing the authorities to arrest him. While in jail, he garnered tremendous support from other patriots. His execution boosted the revolutionaries’ determination to continue fighting for independence. He was also criticized for his violent stance towards the British but that did not prevent him from becoming a legend in the Indian independence movement.
Birthday: September 28, 1907 (Libra)
Born In: Banga, Punjab, British India
Nick Name: Sahid-E-Azam
Also Known As: Shaheed Bhagat Singh
Died At Age: 23
Father: Sardar Kishan Singh Sandhu
Mother: Vidyavati
Siblings: Bibi Amar Kaur, Bibi Parkash Kaur, Bibi Shakuntla, Jagat Singh, Kulbir Singh, Kultar Singh, Rajinder Singh, Ranbir Singh
Born Country: India
Height: 6'0" (183 cm), 6'0" Males
Died On: March 23, 1931
Place Of Death: Lahore, Pakistan
Cause Of Death: Executed By Hanging
Ideology: Anarchists
Founder/Co-Founder: Hindustan Socialist Republican Association
Childhood & Early Life :
Bhagat Singh was born on 28 September 1907, in Banga, Jaranwala Tehsil, Lyallpur district, Punjab, British India, into a family of Punjabi Sikhs. His father and two of his uncles were members of the ‘Ghadar Party.’ They were also actively involved in the Indian independence struggle. They were in jail at the time of Bhagat Singh’s birth due to their participation in revolutionary activities.
Bhagat Singh received his primary education from ‘Dayanand Anglo-Vedic High School,’ an ‘Arya Samaji’ institution.
Inspired by his father and uncles, he grew up to be a patriotic young man and decided to dedicate his life to the independence movement. He became disillusioned with Gandhi’s philosophy of non-violence and joined the ‘Young Revolutionary Movement.’ He then began to advocate violent overthrow of the British Government in India.
He joined the ‘National College’ in Lahore in 1923. His participation in the freedom struggle intensified during this period. He joined the ‘Hindustan Republican Association,’ which had prominent leaders like Chandrashekhar Azad, Ram Prasad Bismil, and Shahid Ashfaqallah Khan who further kindled his patriotic fervor. The name of the organization was changed to ‘Hindustan Socialist Republican Association’ (HSRA) at Singh's insistence in 1928.
Revolutionary Activities & Martyrdom :
The British government set up the ‘Simon Commission’ to report on the political situation in India in 1928. The commission did not include even a single Indian as its member and this greatly agitated the Indian leaders, leading to protests across the country by Indian political parties.
The commission visited Lahore on 30 October 1928. Lala Lajpat Rai, a prominent leader of the Indian independence movement, led a silent march in protest against the Commission. The British police resorted to violence in their attempts to quell the protest.
The superintendent of police James A. Scott ordered a baton charge against the protesters and Rai was grievously injured. He died a few days later on 17 November 1928 of a heart attack. His injuries were believed to have hastened his untimely death.
However, when the matter of his death was raised in the British Parliament, the British Government denied any role in Rai's death. Enraged by this incident, Singh vowed to avenge Rai’s death and teamed up with other revolutionaries, such as Shivaram Rajguru, Sukhdev Thapar, and Chandrashekhar Azad to plot Scott’s murder.
The shooting was scheduled to take place on 17 December 1928. Interestingly, a case of mistaken identity ensued and the revolutionaries killed John P. Saunders instead of Scott. Saunders, an assistant superintendent of police, was shot to death as he was leaving the District Police Headquarters in Lahore.
The young revolutionaries had already planned an elaborate escape and were successful in evading arrest. A day after Saunders was killed, a leaflet was circulated by the ‘Hindustan Socialist Republican Association,’ announcing that the death of Lala Lajpat Rai had been avenged.
Before long, Singh began planning his next protest to gain massive publicity for the cause of Indian independence. Along with other members of HSRA, he planned to explode a bomb inside the ‘Central Legislative Assembly’ to protest against the ‘Public Safety Bill’ and the ‘Trade Dispute Act’ which were being enacted by the Viceroy using his special powers, even though they had been rejected by the Assembly.
On 8 April 1929, Singh, accompanied by Batukeshwar Dutt, hurled two bombs into the Assembly chamber from its public gallery. Their intention was not to kill anyone but to gain publicity. After the explosion, the young men began shouting the slogan "Inquilab Zindabad!" ("Long Live the Revolution") and threw leaflets. Then they allowed the authorities to arrest them.
Singh was given life sentence for the bombing. Shortly after, he was also charged for the murder of Saunders along with Sukhdev, Rajguru, and 21 others. Meanwhile, his life sentence in the Assembly Bomb case was deferred and he was moved to the ‘Central Jail Mianwali’ from the jail in Delhi.
In the jail, he noticed that there were vast differences in the manner in which European prisoners and Indian prisoners were treated. So, he went on a hunger strike, demanding equality in food standards, clothing, toiletries, and other hygienic necessities, as well as access to books and a daily newspaper. The hunger strike had a direct impact on the rise of public support for Singh and his colleagues.
Singh’s growing popularity bothered the British authorities greatly and the government decided to advance the start of the Saunders murder trial, which was henceforth called the ‘Lahore Conspiracy Case.’ Following the trial, Singh, Sukhdev, and Rajguru were sentenced to death by hanging.
The three men were hanged on 23 March 1931 in Lahore jail. Bhagat Singh was just 23 years old. The bodies were then secretly cremated outside the Ganda Singh Wala village.
Major Works :
Bhagat Singh is best-remembered for his role in the assassination of John Saunders, a British police officer. His original plan was to kill James A. Scott, the British officer who had ordered a baton charge on Lala Lajpat Rai during a peaceful protest. When Rai died a few days later, Singh decided to avenge his death by killing the British officer.
Personal Life & Legacy :
- Bhagat Singh’s parents tried to arrange marriage for him but he remained steadfast in his resolve to avoid getting married as he wanted to dedicate his entire life to India’s struggle for independence.
- He holds a significant position in the history of the Indian independence movement and his legend continues to inspire the youth of contemporary India. He has been the subject of numerous books, plays, and films.
- The ‘Shaheed-e-Azam Sardar Bhagat Singh Museum’ was opened on his 50th death anniversary at his ancestral village, Khatkar Kalan.
- He was voted the ‘Greatest Indian,’ ahead of Subhas Chandra Bose and Gandhi, in a poll organized by ‘India Today’ in 2008.
- An 18-foot tall bronze statue of Bhagat Singh was installed in the Parliament of India, beside the statues of Indira Gandhi and Subhas Chandra Bose.
COMMENTS