WhatsAppPink: వైరస్ నుండి ఎలా సురక్షితంగా ఉండాలి?
మొబైల్ వినియోగదారులు అందరిని వణికిస్తున్న స్కామ్ వాట్స్ఆప్ పింక్. ఇది వివిధ వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమవుతున్న కొత్త స్కామ్ మెసేజి. ఈ స్కామ్ మెసేజి "DownloadNow " బటన్‌తో వాట్స్ఆప్ ను పింక్ కలర్ థీమ్ లో చూపించే నకిలీ చిత్రాలను కలిగి వుంటుంది. ఈ మెసేజి నకిలీగా కనిపిస్తున్నప్పటికీ, ఇటువంటి నకిలీ మెసేజిలకు బలైపోయే వినియోగదారులు ఇప్పటికీ ఉన్నారు. అందుకని, వాట్స్ఆప్ లో ఇలాంటి సందేశాలను స్పష్టంగా తెలుసుకోవడం మరియు ఇటువంటి మెసేజీని చూస్తే వెంటనే రిపోర్ట్ చెయ్యడం మంచిది.
దీని గురించి ప్రముఖ ఇంటర్నెట్ సెక్యూరిటీ పరిశోధకుడు రాజ్‌శేఖర్ రాజహరియా ట్విట్టర్ సాక్షిగా వినియోగదారులను హెచ్చరించారు. అంతేకాదు, అలాంటి హానికరమైన లింక్‌ను చూసి, అనుకోకుండా దానిపై క్లిక్ చేస్తే, వాట్స్ఆప్ పింక్ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయాలని రాజ్‌శేఖర్ వినియోగదారులకు సలహా ఇస్తున్నారు. అది ఎలాగ చెయ్యాలో చూద్దాం.
WhatsAppPink వైరస్ నుండి ఎలా సురక్షితంగా ఉండాలి?
1. #WhatsAppPink ను వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయండి.
2. అన్ని వాట్సాప్ వెబ్ పరికరాలను అన్‌లింక్ చేయండి.
3. సెట్టింగ్స్ నుండి బ్రౌజర్ కాష్‌ను క్లియర్ చేయండి. 4. అన్ని యాప్స్ కోసం పర్మిషన్ తనిఖీ చేయండి.
5. ఏదైనా APP అనుమానాస్పద పర్మిషన్ తో కనిపిస్తే, దాన్ని వెంటనే తీసెయ్యండి.
COMMENTS