What is the significance of Ramadan Festival? రంజాన్ పండగ ప్రాముఖ్యత ఏంటి..? ముస్లింలు ఎలా జరుపుకుంటారు..?
సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు... ఉపవాస దీక్షలు :-
రంజాన్ మాసంలో సూర్యోదయం కంటే ముందు నుండి సూర్యాస్తమయం వరకు నీరు, ఆహారం, కనీసం ఉమ్మి కూడా మింగ కుండా కఠోర ఉపవాస దీక్ష చేపడతారు. వయస్సులో తారతమ్యం లేకుండా చిన్న, పెద్ద, ముసలి వారు సైతం భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలో ఉంటారు. ఉపవాస దీక్షలతో బలహీనతలు, వ్యసనాలను జయించవచ్చని ఇస్లాం మత గురువులు చెబుతారు. ఉపవాస దీక్షల వల్ల జీర్ణశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రం చెబుతుంది. ఉపవాస దీక్షలు (రోజా)సహారీతో ప్రారంభమై ఇఫ్తార్తో ముగుస్తుంది. మళ్ళీ ధరల మంట; పెరిగిన టమాట, మిర్చి, నిమ్మకాయల ధరలు.. కిలో ఎంతంటే!! ఇఫ్తార్ విందులు, సుర్మా ఇఫ్తార్ విందులు :- ఖర్జూరపు పండు తిని దీక్ష విరమించే ముస్లింలు ఆ తర్వాత పలురకాలైన రుచికరమైన వంటకాలను భుజిస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో ప్రయాణంలో ఉన్న వారు ఉపవాసదీక్ష ఉప్పుతో కూడా విరమించే అనుమతిఉంది. ఈ వంటకాలతో పాటు సంప్రదాయ వంట హలీమ్ను తయారు చేసుకుని తింటారు. వీటికి సంబంధిన ప్రత్యేక హోటళ్ళు కూడా ఉంటాయి.
‘సుర్మా'తో కళ్లకు కొత్త అందం :-
కళ్లకు ‘సుర్మా' పెట్టుకోవడం కూడా ముస్లింలు సున్నత్ గానే భావిస్తారు. ప్రవక్త హజరత్ మహ్మద్ సదా సుర్మా పెట్టుకునేవారని అంటారు. కాటుక లాగే కళ్లకు రాసుకునే సుర్మా పౌడర్ రూపంలో ఉంటుంది. ముస్లింలు అందమైన భరిణెల్లో వీటిని దాచుకొని ఇంటికి వచ్చిన అతిథులకు అత్తరుతో పాటు కళ్లకు పెట్టు కోవడానికి కూడా ఇవ్వడం సంప్రదాయం. ప్రతి నమాజుకు ముందు సంప్రదాయం ప్రకారం ముఖం, కాళ్ళు, చేతులు శుభ్రం చేసుకుని సుర్మా పెట్టుకుంటారు, ఇది కళ్ళకు మేలుచేస్తుంది.
Ramadan 2023 Date India:
భారత్లో రంజాన్ చంద్రుడు కనిపించే సమయం ఇదే నమాజ్ విశిష్టత ప్రతి మాసంలోను శుక్రవారం రోజున ముస్లింలు నమాజ్ చేయడం ఆనవాయితీగా వస్తూనే ఉంది. ఇక రంజాన్ మాసంలో మత పెద్దలతో నమాజ్ చేయించడం ప్రశస్తమైనది. మసీద్ కు వెళ్ళలేనివారు తాము ఉన్న స్థలాన్ని శుభ్రం చేసుకొని ప్రార్థన చేసి భగవంతుడి కృపకు పాత్రులవుతారు. ముస్లింలు రంజాన్ ఆఖరు పది రోజులు ఇళ్ళు వదలి మసీదుల్లో ఉంటూ మహాప్రవక్త అల్లాహ్ గురించి ప్రార్థనలతో ఆథ్యాత్మిక భావాన్ని పెంపొందించుకుంటారు. రంజాన్ పండుగను ఈదుర్ ఫితర్ అని అంటారు. నెల పొడుపు చంద్రుని దర్శించిన తరువాత రోజు ఉదయం పండుగను జరుపుకొంటారు. పండుగ ప్రార్థనలను ఈద్గాలోనే జరుపుతారు. నమాజ్ అనంతరం ముస్లింలు, ముస్లిమేతరులు ఒకరినొకరు స్నేహాభావం పెంపొందించుకొనుటకు 'అలయ్ బలయ్, ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలను తెలుపుకొంటారు. పండుగ రోజు షీర్ ఖుర్మా అనబడే మధురమైన సేమియాను తప్పక వండుతారు, ఆత్మీయులకు తినిపిస్తారు. నేటితో వీరి నెలరోజుల ఉపవాస దీక్ష పూర్తవుతుంది. దానధర్మాలు ఎందుకు చేస్తారు..? ఖురాన్ సిద్దాంతం ప్రకారం తాము సంపాదించిన దానిలో పేదవారి కొరకు కనీసం నూటికి రెండు రూపాయలు అయినా దానధర్మం చేయాలని భావిస్తారు, పండ్లు, గోధుమలు, సేమియా, బట్టలు, బంగారం మొదలినవి దానం చేయాలని ఖురాన్ చెబుతోంది. రంజాన్ నెలలో ఇలా దానం చేస్తే నిరుపేద వారు కూడా పండుగ పూట సంతోషంగా ఉంటారని ముస్లిం పెద్దలు చెబుతుంటారు. ఈ దానధర్మ గుణం ,భక్తి భావాన సంవత్సరం మొత్తం అనుసరించాలని పవిత్ర రంజాన్ నెలతో ప్రారంబిస్తారు. ఆకలి అంటే ఎంత కఠీనంగా ఉంటుందో స్వయంగా అనుభవిస్తే తప్ప అనుభవంలోకి రాదు అనే భావనతో ఈ రంజాన్ 'రోజా' ఉపవాసదీక్షలు అనే సూత్రాన్ని ప్రతిపాదించారు. లోకంలో ఎంతో మంది అభాగ్యులు, నిరుపేదలు ఆకలితో అలమటిస్తూ దుర్భరమైన జీవితాలను వెల్లబుచ్చుతున్న వారి కొరకు మానవత్వంతో విధిగా తమ సంపాదనలో కొంత శాతం కేటాయించి సాటివారికి దాన ధర్నాలు చేయాలి అని సూచించారు, మనకు ఆకలి వేస్తే భరించడం ఎంత కష్టమో 'రోజా' ఉపవాసం ద్వార తెలియజేసి సాటి నిరుపేదలకు దానధర్మాలు చేయమని పవిత్ర ఖురాన్ సూచిస్తుంది. మానవీయ విలువలను తెలియజేసే పవిత్ర ఖురాన్ గ్రంధాన్ని తప్పకుండా ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరు చదవాలి, లేదా వినాలి అనే నియమమం కుడా ఉంది.
COMMENTS