" కాలదోష నియమం ” అనగా ఏమిటి ?
1. నిధుల కొరకు డిమండ్ల పై చర్చలు జరుగుతున్నప్పుడు మొతాన్ని తగ్గించుటకు కొత్త తీర్మానాలను ప్రవేశపెడతారు . ఈ క్రింది వాటిలో వేటిని కొత్త తీర్మానాలుగా వర్గీకరిచుట ?
ఎ . ఆర్థిక కోత
బి . లాంచన ప్రాయమైన కోత
సి . విధాన కోత
డి . పథక కోత
కింద ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానమును ఎంపిక చేయండి ?
1. ఎ , బి , సి
2. బి , సి , డి
3. సి , డి , ఎ
4. ఎ , సి
2. ద్రవ్య బిల్లులకు సంబంధించిన ఈ క్రింది వాఖ్యలలో ఏది ఏవి సరైనవి ?
ఎ . ఉభయ సభలకు వాటిపై సమాన అధికారం కలదు .
బి . అవి రాజ్యసభలో ప్రవేశపెట్టబడతాయి
సి . అవి లోక్సభలో ప్రవేశపెట్టబడతాయి
డి . రాజ్యసభ సవరణలను సిఫారసు చేయగలదు .
ఈ క్రింది వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనవి.
1 ) ఎ , మాత్రమే
2 ) ఎ , మరియు సి
3 ) బి , మరియు సి
4 ) ఎ మరియు బి
3. ద్రవ్య బిల్లుకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరైనది కాదు ?
1. ఒక వేళ బిల్లు , ద్రవ్య బిల్లు కాదా అని ప్రశ్న తలెత్తితే లోక్సభ స్పీకర్ నిర్ణయం అంతిమం
2. ద్రవ్య బిల్లు విషయంలో ప్రతిష్టించిన ఏర్పడితే , రాష్ట్రపతి పార్లమెంట్ సంయుక్త సమావేశానికి పిలుపునిస్తారు .
3. దీనిని రాజ్యసభలో ప్రవేశపెట్టారాదు
4. రాష్ట్రపతి సిఫారసుపై మినహా ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టరాదు .
4. పార్లమెంట్ ద్వారా ఆమోదించబడిన ద్రవ్యేతర బిల్లు రాష్ట్రపతి పున పరిశీలనకు పార్లమెంట్కు త్రిప్పి పంపితే దానిని పార్లమెంట్ ఎలాంటి మార్పులు లేకుండా ఆమోదిస్తే అప్పుడు
1. బిల్లును సుప్రీంకోర్టుకు నిర్దేశించును
2. రాష్ట్రపతి తన ఆమోదంను ఇచ్చును
3. రాష్ట్రపతి తన ఆమోదంను మళ్లీ నిలిపి ఉంచవచ్చు .
4. బిల్లు తనంతట తానే కాలదోషం చెందును
5. క్రింది వరుస క్రమములలో ఏది , పార్లమెంట్ ఒక సాధారణ బిల్లుకు ఆమోదించబడుటకు సరైనది ?
1. ప్రవేశ అనంతర తీర్మానం , నియామల చర్చ క్లాజు తరువాత క్లాజును పరిశీలించుట ఆమోదం
2. నియమాల చర్చ , ఆదికృతము , ప్రవేశ అనంతర తీర్మానం , క్లాజ్ తరువాత క్లాజ్ పరిశీలించుట , ఆమోదం .
3. నియము చర్చ , ప్రవేశ అనంతరం తీర్మానం , క్లాజ్ తరువాత క్లాజ్ పరిశీలించుట
4. ఏదీ కాదు
6. ఈ క్రింది వ్యాఖ్యలలో ఏది సరైనది ? భారత సంచిత నిధికి ప్రభారమైన వ్యయమునకు సంబంధించిన అంచనాలు ?
1. రాజ్యసభలో మాత్రమే చర్చించవచ్చును
2. లోక్సభలో మాత్రమే చర్చించవచ్చును
3. పార్లమెంట్లోని ఏ సభలోనైనా చర్చించవచ్చును
4. పార్లమెంట్ ఏ సభలో కూడా చర్చించరాదు
7 . ఎంత కాలపరిమితి వరకు పార్లమెంట్ ఏ సభలోని సభ్యుడు ఓక వేళ సభ అనుమతి లేకుండా , అన్ని సమావేశాలకు కొంత కాలానికిమించి గైర్హాజరు అయితే , సభ అతని స్థానమును ఖాళీగా ప్రకటించవచ్చును ?
1. 30 రోజులు
2. 40 రోజులు
3. 60 రోజులు
4. 20 రోజులు
8. ఈ క్రింది వాటిని పరిశీలించుము ?
1. లోక్సభ పరిశీలనలో ఉన్న ఒక బిల్లు , లోక్సభ సమావేశానికి దీర్ఘకాలిక వాయిదాతో కాలదోషం చెందును .
2. రాష్ట్రపతి ద్వారా పునర్ పరిశీలనకు త్రిప్పి పంపబడిన ఒక బిల్లు లోక్సభలో రద్దుతో కాలదోషం చెందుదు
3. లోక్సభలో ఇంకా ఆమోదించని & రాజ్యసభలో అనిర్ణీతస్థితిలో ఉన్న ఒక బిల్లు లోక్సభ రద్దుతో కాలదోషం చెందదు
4. లోక్సభ లో ఆమోదించని & రాజ్యసభలో అనిర్ణీత స్థితిలో ఉన్న ఒక బిల్లు లోక్సభ రద్దుతో కాలదోషం చెందుతుంది
9. " కాలదోష నియమం ” అనగా ఏమిటి ?
1. పార్లమెంట్ ద్వారా ఓటింగ్ చేయబడిన వినియోగాధికారాన్ని ఆర్థిక సంవత్సరం సమాప్తంతో కాలదోషం చెందును .
2. వినియోగాధికార బిల్లు , రాజ్యసభ ద్వారా 14 రోజుల వ్యవధిలో త్రిప్పి పంపించబడినట్లయితే అది కాలదోషం చెందును .
3. పార్లమెంట్లో గల అనిర్ణీత బిల్లులు , సభ దీర్ఘకాలిక వాయిదాతో అన్ని బిల్లుల కాలదోషం చెందును
4. పైవన్నీ
10. రాజ్యాంగం అనుసారం , లోక్సభ కనీసం ఇన్ని రోజులకు తప్పక సమావేశమవ్వాలి ?
1. సమావేశముల మధ్య నాలుగు నెలలు మించకుండా , సం || నకు 3 పర్యాయాలు
2. సమావేశముల మధ్య మూడు నెలలు మించకుండా , సం॥నకు 3 పర్యాయాలు
3 . సమావేశముల మధ్య 6 నెలలు మించకుండా , సం॥నకు 2 పర్యాయాలు
4. సమావేశము మధ్య 5 నెలలు మించకుండా , సం॥నకు 2 పర్యాయాలు
11. భారత సంచిత నిధికి ప్రభారమైన వ్యాయాలు వీటితో కూడుకొని ఉంటుంది ?
1. భారత ప్రభుత్వం , చెల్లింవలసిన అప్పులు
2. భారత కంథ్రోలర్ మరియు ఆడిటర్ జనరలు చెల్లించదగిన జీతము , భత్యములు మరియు ఫించను
3. హైకోర్టు న్యాయమూర్తులకు చెల్లించదగిన ఫించను
4. పైవన్నీ
12. రాజ్యసభ ఛైర్మన్ వీరి ద్వారా ఎన్నుకోబడతారు ?
1. రాజ్యసభ సభ్యులందరూ
2 . పార్లమెంటు ఎన్నిక కాబడిన సభ్యులు
3. పార్లమెంట్ సభ్యులందరూ
4. రాజ్యసభకు ఎన్నిక కాబడిన సభ్యులు
Answers ::
1 ) 4 , 2 ) 3 , 3 ) 2 , 4 ) 2 , 5 ) 1 , 6 ) 3 , 7 ) 3 , 8 ) 3 , 9 ) 1 , 10 ) 3 , 11 ) 4 , 12 ) 3
COMMENTS