రాజ్యసభలో కావలసిన సమావేశ సంఖ్య
1. క్రింది వానిలో ఏది కోత తీర్మాన ఉద్దేశ్యంకు సంబంధించి వర్తించును ?
1. పాలనపరమైన ఏదైనా లోపం వైపు దృష్టిని మరలించట
2. కొన్ని యదార్థ అంశములపై చర్చను కేంద్రీకరించడం
3. నిర్థిష్ట సమస్యలను దృష్టికి తేవడం
4. పైవన్నీ
2. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి క్రింది వానిలో ఎవరు అధ్యక్షత వహిస్తారు ?
1. ఉపరాష్ట్రపతి
2. ప్రధానమంత్రి
3. లోక్సభ స్పీకర్
4. రాజ్యసభ ఛైర్మన్
3. లోక్సభ స్పీకర్కు సంబంధించి ఏది సరైనది ?
1. స్పీకర్ వివిధ కమిటీల ఛైర్మను నామ నిర్ధేశనం చేస్తారు .
2. స్పీకర్ ఒక నిర్ధిష్టమైన బిల్లును ద్రవ్య బిల్లు కాదా అన్ని దృవీకరిస్తారు .
3. స్పీకర్ శూన్య సమయంను కుదించే లేదా రద్దు చేసే అధికారం కలదు
4. పైవన్నీ
4. రాజ్యసభలో కావలసిన సమావేశ సంఖ్య ఎంత ?
1. 30
2.25
3.70
4. 100
5. భారత రాజ్యాంగ ప్రకరణ 368 కు లోబడి , ఒక రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్ ద్వారా దీనితో ఆమోదించబడును ?
1. హాజరైన మరియు ఓటు వేసిన సభ్యులలో నాలుగింట మూడు వంతుల అధిక్యంతో
2. హాజరైన సభ్యులలో ఓటింగ్ ద్వారా సాధారణ ఆధిక్యంతో
3. మొత్తం సభ్యులలో ఆధిక్యంతో మరియు హాజరైన మరిము ఓటు వేసిన సభ్యులలో మూడింట రెండు వంతులు తగ్గకుండా ఆధిక్యంతో
4. హాజరైన మరియు ఓటు వేసిన సభ్యులలో మూడింట రెండు వంతుల ఆధిక్యంతో
6. భారత సంచిత నిధికి ప్రభారమైన వ్యయమునకు సంబంధించి అంచనాలు
1. రాజ్యసభలో మాత్రమే చర్చించవచ్చును
2. పార్లమెంట్ ఏసభలో కూడా చర్చించవచ్చురాదు
3. పార్లమెంట్ ఏ సభలోనైనా చర్చించవచ్చును
4. లోక్సభలో మాత్రమే చర్చించవచ్చును
7. ద్రవ్య బిల్లు , రాజ్య సభ ద్వారా గణనీయంగా సవరించిబడినప్పుడు ఏమి జరుగుతుంది .
1. లోక్సభ , బిల్లు ఇక పరిగణించదు .
2. లోక్సభ , బిల్లును రాజ్యసభ పునపరిశీలను పంపవచ్చును
3. బిల్లును ఆమోదించుటకు రాష్ట్రపతి సంయుక్త సమావేశానికి పిలుపునివ్వవచ్చు
4. రాజ్యసభ సిఫారసులను స్వీకరించి లేదా తిరస్కరించి లోక్సభ , బిల్లుతో ముందుకు సాగవచ్చును
8. ఈ క్రింది వానిలో ఏది సరైనది కాదు ?
1. టెలీ కమ్యూనికేషన్ శాఖ యొక్క నిధుల కొరకు డిమాండ్ను పార్లమెంట్ వేరుగా సమర్పించబడును
2. వివిధ మంత్రిత్వ శాఖల యొక్క నిధులు కొరకు డిమాండ్లు , ప్రతిశీర్షిక క్రింది వ్యయాల ప్రణాళిక మరియు ప్రణాళికేతర అంచనాలలో కూడుకుని ఉంటుంది .
3. రైల్వే బడ్జెట్ మరియు రైల్వేలకు సంబంధించిన నిధుల కొరకు డిమాండ్లు పార్లమెంట్ వేరుగా సమర్పించబడును .
4. సాధారణ ప్రతి మంత్రిత్వశాఖకు లేదా శాఖకు ఒక నిధుల కొరకు డిమాండ్ సమర్పించబడును
9. లోక్ సభ స్పీకర్ గూర్చి ఈ క్రింది వానిలో ఏది సరైనది కాదు ?
1. అతనికి , దీర్ఘకాలిక వాయిదా తరువాత కుడా సభను సమావేశానికి పిలిచే అధికారం కలదు
2. ఒక వేళ అతని లోక్సభ సభ్యత్వం రద్దయితే , తను పదవి నిష్కమించాలి .
3. అతని సభను నిరవధికంగా వాయిదా వేసే అధికారం కలదు
4. సభ రద్దుయిన తరువాత కూడా ఇతడు పదవిలో కొనసాగుతారు , మరియు ఆది తదనంతర సభ మొదటి సమావేశానికి ముందు వరకు కొనసాగును
10. క్రింది వాటిలో ఎవరు రాజ్యసభ సభ్యున్ని దాన్ని డిప్యూటీ ఛైర్మన్ గా ఎంపిక చేస్తారు ?
1. ప్రధానమంత్రి
2. రాష్ట్రపతి
3. రాజ్యసభ
4. పార్లమెంటరీ వ్యవహారాల కేంద్రమంత్రి
11. కేంద్ర జాబితాలోని అంశము దృష్ట్యా అమలులో ఉన్న చట్టం యొక్క శ్రేష్ట పాలన కొరకు అదనపు న్యాయస్థానములను ఏర్పాటు చేయగలరు ?
1. సంబంధిత రాష్ట్ర హైకోర్టు
2. ప్రధానమంత్రి
3. భారత ప్రధాన న్యాయమూర్తి
4. పార్లమెంట్
12. పార్లమెంట్ బడ్జెట్ చర్చ సమయంలో దీనిని చెయదు ?
1. డిమాండ్ను పెంచుట
2. డిమాండు ను తగ్గించుట
3. డిమాండ్ను తిరస్కరించుట
4 . డిమాండను ఆమోదం ఇవ్వటం
Answers ::
1 ) 4 , 2 ) 3 , 3 ) 4 , 4 ) 2 , 5 ) 3 , 6 ) 3 , 7 ) 4 , 8 ) 1 , 9 ) 1 , 10 ) 3 , 11 ) 4 , 12 ) 1
COMMENTS