ఓం పర్వతం...
Om Parvat :
దీనిని చిన్న కైలాసమని, పిలుస్తుంటారు...ఈ పర్వత గొప్పదనమేమిటంటే, ఈ పర్వతంపై పేరుకున్న మంచు ఓంకార రూపాన్ని సంతరించుకోవడమే... ఈ పర్వతాన్ని ఈశ్వరుని ప్రతి రూపంగా భావిస్తుంటారు... ఈ పర్వత ముఖ భాగం అంటే Om/ॐ భారత్ వైపు, వెనుక భాగం నేపాల్ వైపు ఉంటాయి... ఇది భరత్, నేపాల్ సరిహద్దులలో హిమాలయ పర్వత శ్రేణులలో ఉంది... అందుకే పర్వతం దగ్గరకు వెళ్ళాలంటె తప్పనిసరిగా రెండు దేశాల అనుమతి తీసుకోవలసి ఉంటుంది..
ఈ పర్వతానికి ముందు భాగంలో పార్వతీ సరస్సు, Jonglingkong సరస్సులు ఉంటాయి.. Jonglingkong సరస్సును మానససరోవర సరస్సుకు ప్రతిరూపంగా భావిస్తుంటారు..
కైలాస మానస సరోవర యాత్ర జరిపే యాత్రికులు ఈ పర్వతాన్నితప్పని సరిగా దాటి వెళ్ళవలసి ఉంటుందట...
ఈ పర్వతం యొక్క ఎత్తును ఖచ్చితంగా నిర్థారించబడలేదు సుమారు 5950 మీ. ఉంటుందని ఒక అంచనా
ॐ రూపాన్ని చూడాలంటే ఫితోరాఘర్, ఉత్తరాఖండ్ వెళ్ళాలి...
ఈ టపా చూస్తున్న వారికందరికీ ఈశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు...
COMMENTS