గబ్బిలం గురించి తెలుసు కుందాం...
Let's learn about the bat 2022: అన్ని పక్షులు వాటి పిల్లలకు పాలు ఇవ్వవు. కానీ గబ్బిలం మాత్రం పిల్లలకు పాలు ఇస్తుంది. ఇది కూడా పక్షే కదా...
గబ్డిలం పక్షి కాదు. పక్షిలాగా రెక్కలున్న ఓ క్షీరదం(mammal) . ఇది కైరాప్టెరా అనే క్రమానికి చెందిన పాలిచ్చే జంతువు. ముందు వెనక కాళ్లవేళ్ల మధ్య బాతు కాళ్లకున్నట్టు చర్మపైపొర ఉండడం వల్ల ఇది పక్షిలాగా ఎగరగలదు. పదునైన కొక్కెంలా ఉన్న గోళ్లసాయంతో చెట్ల కొమ్మలకు తలకిందులుగా వేలాడుతుంది. దీనికి కళ్లున్నా గుడ్డిది. తన నోటితో తానే అతి ధ్వనులను (ultrasonic sounds) చేస్తూ ఆ ధ్వనుల ప్రతిధ్వనుల (echos)ను వినడం ద్వారా పరిసరాలను, వస్తువులను ఆహారాన్ని చూస్తుంది. మిగిలిన క్షీరదాలలోలాగానే ఆడ, మగ లైంగికత ఉంది. ఆడ గబ్బిలం గర్భం ధరించి పశువులు, మనుషులలాగానే పిల్లల్ని కంటుంది. తడవకు ఒకే బిడ్డను కంటుంది. ఆడమగ గబ్బిలాలు కలుసుకున్నా ఆహారం సమృద్ధిగా దొరికే వరకు ఫలదీకరణం జరగకుండా శుక్రకణాల్ని, అండాన్ని విడివిడిగా తన శరీరంలోనే ఉంచుకోగల అద్భుత సామర్థ్యం ఆడగబ్బిలాలకు ఉంది. బిడ్డ గబ్బిలం తనలాగే ఎగిరే వరకు తల్లి పాలిచ్చి పోషిస్తుంది.
COMMENTS