హోలీ పండుగ - మీకు తెలియని ఆసక్తికర విషయాలు
Holi Festival : కార్తీకంలో దీపారాధనకు, మాఘ మాసంలో పుణ్యస్నానాలకు ఎంతో విశిష్టత ఉంది. ఇక, విష్ణువుకు ప్రీతికరమైన ఫాల్గుణంలో శ్రీమన్నారాయణను ఆరాధించే వారికి సకల సంపదలు కలుగుతాయి.
● ఫాల్గుణ పౌర్ణమిని మహా ఫాల్గుని, డోలికా పూర్ణిమ అని హోలికా పూర్ణిమ అని కూడా అంటారు.
● ఈ రోజున లక్ష్మీనారాయణ వ్రతం చేసి స్వామిని ఊయలలో ఉంచి జోలపడతారు.
● కాబట్టి దీనీని డోలికా పూర్ణిమ అంటారు. కృష్ణ భగవానున్ని ఊయల్లో వేసిన వేడుకకు గుర్తుగా బెంగాల్లో డోలికోత్సవాన్ని జరుపుకుంటారు.
● ఉత్తర భారతదేశంలో రాక్షస పీడ తొలగిపోవడం కోసం హోలికా అనే శక్తిని ఆరాధిస్తారు.
● ఆ మర్నాడు బహుళ పాడ్యమి వసంతోత్సవం పేరుతో ఒకరి పై ఒకరు రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకొంటారు.
● పాల్గుణ పౌర్ణమి మరుసటి రోజు నుండే వసంత మాసం ప్రారంభమవుతుంది. ఈ రోజు చందనంతో సహా మామిడి పూతను తిన్నవారు సంవత్సరమంతా సుఖంగా ఉంటారు.
● ఇక, తెలుగు నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం. హోలీ పర్వదినం ఏటా ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు.
● చతుర్దశి నాడు కాముని దహనం అనంతరం పాల్గుణ పౌర్ణమి నాడు వచ్చే హోలీ పండుగను భారత్లోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ దేశాల్లో కూడా వైభవంగా జరుపుకుంటారు.
● వసంత కాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను 'వసంతోత్సవం' పేరిట జరుపుకునేవారు.
● దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి.
● ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం.
● హిరణ్య కశ్యపుని సోదరి హోలిక ప్రహ్లాదుని చంపబోయి తాను దహనమవుతుంది.
● ఆ రాక్షసి చనిపోయిన రోజును పురస్కరించుకుని హోలీ పండుగను నిర్వహిస్తారని కొందరంటారు.
● ఇంకొందరు ఫాల్గుణ పౌర్ణమి నాడు కాముని పున్నమి పేరిట సంబరాలు జరుపుకుంటారు.
● సతీవియోగంతో విరాగిలో మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు.
● దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మథుని సాయం తీసుకున్నారు. మన్మథుడు శివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగించి, తపోభంగం కలిగించాడు.
● తపో భంగంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మథున్ని భస్మం చేస్తాడు.
COMMENTS