వజ్రాలు (Diamonds) గురించి నమ్మలేని నిజాలు
Facts about Diamonds :
ఈ ప్రపంచంలో అత్యంత కఠినమైనది అత్యంత ఖరీదైనది వజ్రం (Diamond) అని చెప్పవచ్చు. చాలామంది వజ్రాన్ని వజ్రం తోనే కొయ్యాలి అంటారు. భూమిలోపల వజ్రాలు ఏర్పడాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది.వాతావరణంలో మార్పులు సంభవించినప్పుడు లేదా భూమిపై వర్షాలు పడినప్పుడు ఇవి లోపల నుండి పైకి వస్తాయి.
వజ్రాల (Diamond) కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం
- వజ్రం అనేది స్పటికరూప ఘన పదార్థం. నాగరికత అభివృద్ధి చెందని పూర్వకాలంలోనే భారతదేశం ఎన్నో రకాల వజ్రాలను ఎగుమతి చేసేది. ఈ భూమిపై మొట్ట మొదట వజ్రాలు భారతదేశంలోనే బయటపడ్డాయి. మన భారతదేశం ద్వారానే వజ్రాల గురించి ప్రపంచానికి తెలిసింది. ప్రపంచంలోనే విలువైన అటువంటి కోహినూరు వజ్రం కూడా మన భారతదేశంలో దొరికింది. కోహినూరు వజ్రం యొక్క విలువను ఇప్పటికీ ఏ దేశం వారు అంచనా వేయలేకపోతున్నారు. దీన్ని బట్టి మన భారతదేశం పూర్వకాలంలో ఎంతో సుసంపన్నమైన దేశంగా ఉండేదని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ కోహినూరు వజ్రం లండన్ మ్యూజియంలో ఉంది.
- భూమి లోపల మనకు దొరికే వజ్రాలలో వైట్ డైమండ్స్ తో కలర్ డైమండ్స్ కూడా దొరుకుతాయి. ఈ కలర్ డైమండ్స్ భూమి లోపల జరిగే కొన్ని రకాల చర్యల వల్ల ఏర్పడతాయి. వైట్ డైమండ్స్ కంటే కలర్ డైమండ్స్ ఖరీదు ఎక్కువగా ఉంటుంది.
- 18 వ శతాబ్దం ముందు వరకు కూడా భారతదేశమే ప్రపంచ దేశాలకు ఎక్కువగా అతి విలువైన వజ్రాలు ను ఎగుమతి చేసేది.
- అమెరికా దేశంలో లో ఆపరేటింగ్ డైమండ్ మైన్ అనే ఒక పెద్ద డైమండ్ మైన్ ఉంది. అక్కడికి వచ్చే టూరిస్టులు ఎవరైనా సరే అక్కడ ఉండి భూమిని తవ్వుకొని వజ్రాలను వెతికి సంపాదించుకొని వారితో పాటుగా దొరికిన వజ్రాలను ఇంటికి తీసుకెళ్లవచ్చు.
- వజ్రం అనేది కర్బన పదార్థంతో నిర్మితమై ఉంటుంది. కానీ దీనిలో వేస్ట్ పదార్థమైన బోరాన్ మరియు నత్రజని కూడా ఉంటుంది.
- 1827 వ సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో ఒక రాయిని కనుగొన్నారు. దాన్ని శుద్ధి చేసి పాలిస్ చేసిన తరువాత అది వజ్రమని తేలడంతో దక్షిణ ఆఫ్రికాలోని చాలా నదుల్లో, నేలల్లో కూడా వజ్రాల కోసం అన్వేషణ సాగించారు.
- వజ్రాలను ప్రయోగశాలలో, లేబరేటరీలో తయారు చేయడం చాలా కష్టం.
- స్వచ్ఛమైన వజ్రం ఎటువంటి లిక్విడ్స్ లో గాని, అమ్లల్లో గాని, ఆసిడ్స్ లో గాని అసలు కరగదు.
- పరిశ్రమల్లో పెద్ద పెద్ద గాజు పలకలు కోయడానికి వజ్రాలనే వాడుతుంటారు.
COMMENTS