గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్ రెండూ ఒకటేనా ?
Are Heart Attack and Cardiac Arrest the Same?: హార్ట్ ఎటాక్ , కార్డియాక్ అరెస్ట్ అనే పదాలు తరచూ విటుంటాం. ఇవి ఒకేలా కనిపించినా ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉంటాయి. ఈ రెండు వ్యాధుల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ రెండు వ్యాధుల గురించి ముందుగా తెలుసుకోవాలి.
గుండెకు రక్త
ప్రసరణ అందనపుడు గుండెపోటు సంభవిస్తుంది అయితే ఏదైనా కారణం వల్ల గుండె పనిచేయకపోవడం
లేదా అనుకోకుండా గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు కార్డియాక్ అరెస్ట్ సంభవించవచ్చు.
గుండెపోటు:
దీనిని మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అని కూడా అంటారు. గుండెలోని ధమనులు మూసుకుపోయి ఆక్సిజన్‌తో
కూడిన రక్తాన్ని గుండె విభాగానికి చేరకుండా నిరోధించినప్పుడు ఎవరైనా గుండెపోటును ఎదుర్కొంటారు.
ఈ సందర్భంలో గుండెకు రక్తం సకాలంలో చేరకపోతే అది అకాల మరనానికి దారితీస్తుంది. చికిత్స
ఆలస్యమైతే బాధితుడు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. గుండె పోటు సంభవించిన సందర్భంలో
రక్తనాళాల అడ్డుపడటం అనేది పూర్తిగా లేదా పాక్షికంగా ఉండవచ్చు. కరోనరీ ఆర్టరీ పూర్తిగా
అడ్డుపడినట్లయితే, ఆ వ్యక్తి ST- ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అయిన STEMI గుండెపోటుతో
బాధపడుతున్నాడని అర్థం. అయితే పాక్షికంగా అడ్డంకులు ఉన్నట్లయితే, రోగి NSTEMI గుండెపోటును
ఎదుర్కొంటున్నారని అర్థం.
గుండెపోటు లక్షణాలు:
గుండెపోటు లక్షణాలు చాలా సాధారణంగా ఉంటాయి. అందుకే చాలామంది దీనిని గుర్తించలేరు.
కొన్నిసార్లు పొట్టలో పుండ్లు అని కూడా అనుకుంటారు. కొన్ని నిమిషాల కంటే అధికసమయం పాటు
ఉండే ఛాతీ నొప్పి, అసౌకర్యం గుండెపోటు లక్షణం కావచ్చు. ఊపిరి ఆడకపోవటం ఉన్నట్టుండి
చెమట పట్టడం, వికారంతో పాటు తేలికపాటి తలనొప్పి కూడా గుండెపోటు లక్షణాలలో ఒకటి.
కార్డియాక్ అరెస్ట్ :
ఎలాంటి ముందస్తు సూచన లేకుండా ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్‌లు సంభవించవచ్చు.
గుండెపోటు సంభవించిన తర్వాత లేదా అతను ఆమె కోలుకున్న సమయంలో కూడా ఇది సంభవించవచ్చు.
అయితే గుండెపోటు సాధారణంగా కార్డియాక్ అరెస్ట్‌కు దారితీస్తాయని చెప్పడం తప్పవుతుంది.
కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు :
కార్డియాక్ అరెస్ట్లోని ప్రధాన లక్షణం స్పృహ కోల్పోవడం, స్పందించకపోవడం. బాధితులకు ఛాతీలో విపరీతమైన అసౌకర్యం, గుండె దడ, గురక, ఊపిరి ఆడకపోవడం లేదా సక్రమంగా లేని హృదయ స్పందనలు మొదలైనవి దీని లక్షణాలు. ఇవి కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.● అలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మథుడి బొమ్మను గడ్డితో చేసి తగులబెడతారు.
● శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది.
● దీనివల్ల వైరల్ జ్వరం, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన, నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందనేది ఒక వాదన.
● కుంకుమ, పసుపు, బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు.
● తడి రంగుల కోసం, మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది.
● కారణాలు ఏవైనా రంగుల పండుగ హోలీ అంటే అందరికి ఎంతో ఉత్సాహం.
● చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా స్నేహితులు, బంధువులతో ఎంతో ఆనందరంగా, ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటారు.
COMMENTS