అమెజాన్ నదీ పరివాహక ప్రాంతం రహస్యాలు
Amazon River Mysteries Telugu: Amazon River ప్రపంచంలో రెండవ అతిపెద్ద నదిగా ప్రసిద్ధిగాంచింది . భూమిపై సహజసిధ్ధం గా ఏర్పడిన ఈ నదిలో మనకు తెలియని తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి . ఇటువంటి అమెజాన్ నది గురించి కొన్ని ముఖ్య విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం .
1. అమెజాన్ నది ప్రధానంగా 9 దేశాలలో ప్రవహిస్తోంది.
Amazon Riverదక్షిణ అమెరికాలోని పెరూ దేశంలో ఉన్న ఆండీస్ పర్వత శ్రేణులలోపుట్టి పశ్చిమం నుండి తూర్పు వైపుగా బొలివియా , వెనుజులా , కొలంబియా, ఈక్వెడార్ మరియు బ్రెజిల్ వంటి వేర్వేరు దేశాల భూభాగాల గుండా ఈ నది ప్రవహిస్తుంది. ఈ నదీ ప్రవాహం చివరగా అట్లాంటిక్ మహా సముద్రంలో కలుస్తుంది.
2. ప్రపంచంలో రెండవ అతి పెద్ద పొడవైన నది.
అమెజాన్ నది పొడవు సుమారు 6,400 కి. మీ (400 మైళ్ళ పొడవు) ఉంటుంది. ఆఫ్రికా లోని అతిపెద్ద నైలు నది తర్వాత రెండవ అతిపెద్ద నది Amazon River మాత్రమే. అంతే కాకుండా ఈ నది 20% మంచి నీటిని అట్లాటిక్ సముద్రంలో కలిపేస్తోంది. అందువల్ల ఈ నీరు కలిసే ప్రాంతంలో సముద్రపు లవనీయత చాల వరకు తగ్గిపోతుంది.
3. అమెజాన్ నది ప్రపంచంలో అత్యధిక ఉప నదులను కలిగి ఉంది.
అమెజాన్ నదికి 1,100 ఉపనదులు ఉన్నాయి. ప్రపంచంలో ఏ నదికి ఇన్ని ఉపనదులు లేవు. వీటిలో 17 ఉపనదులు 15,000 కిలోమీటర్లు పొడవు ఉన్నాయి.
4. అమెజాన్ నది మొత్తం ఈత కొట్టడానికి 66 రోజులు పడుతుంది.
మార్టిన్ స్ట్రేల్ అనే వ్యక్తి 2007 వ సంవత్సరంలో ఈ అమెజాన్ నది అంతా ఈత కొట్టాడు. ప్రతిరోజు ఈ నదిని ఈదడానికి 10 గంటల సమయం కేటాయించేవాడు. ఇలా మొత్తం నదిని ఈదడానికి 66 రోజులు పడుతుందని తెలుసుకున్నాడు.
5. అమెజాన్ నది వర్షాకాలంలో చాలా వరకు పెరుగుతూ ఎక్కువ ప్రవాహం కలిగి ఉంటుంది.
వర్షా కాలంలో అమెజాన్ నది వెడల్పు 120 మైళ్ళు(190 కిలోమీటర్లు) పెరుగుతుంది. అందువల్ల ఈ నదిని రివర్ సీ అనికూడా పిలుస్తారు. ఇప్పటి వరకు అమెజాన్ నదిపై ఎటువంటి వంతెనలు కట్టలేకపోయారు.
6. ప్రపంచములోని అతి భయంకర చేపలు Amazon నదిలో ఉంటాయి.
మనుషుల మరియు జంతువుల మాంసాన్ని తినే ఫిరోనా అనబడే ప్రమాదకర చేపలు ఈ అమెజాన్ నదిలో తిరుగుతుంటాయి. ఇవి గుంపులుగా మనిషిపై దాడి చేసి మాంసాన్ని తింటాయి మరియు రక్తాన్ని తాగుతాయి.
7. అమెజాన్ నది వల్ల ప్రతిసంవత్సరం కొత్త అడవులు పెరుగుతూ ఉంటాయి.
అమెజాన్ నది అత్యంత విస్తారమైన వర్షపాత అడవులను కలిగి ఉంది. ఈ నదీ పరివాహక ప్రాంతంలో సుమారు 9 సెంటిమీటర్ వర్షపాతం ఉంటుంది. ప్రతిసారి ఈ నదిలో వరదలు సంభవిస్తూ ఉంటాయి. ఇలా కొత్తగా పుట్టిన వరదల వల్ల కొత్త,కొత్త అరణ్యాలు ఏర్పడుతూ ఉంటాయి.
8. అమెజాన్ నది ప్రవాహం సముద్రంలో కలవడం వల్ల సముద్రం యొక్క రంగు మారుతుంది.
అమెజాన్ నది అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. అట్లాంటిక్ మహా సముద్రంలో ఈ నది కలవడం వల్ల సముద్రంలోని ఉప్పు నీరు లవనీయత తగ్గి 20% మంచినీరుగా మారుతుంది. ఇలా మంచి నీరుగామారే క్రమంలో సముద్రం రంగు చాలా వరకు మారిపోతుంది.
అమెజాన్ నది గురించి ఇంకా చెప్పాలంటే ప్రపంచేంచంలోని అతిపెద్ద అనకొండ వంటి పాములు మరియు అతి భయంకరంగా ఉండే నల్లటి ముసళ్ళు మనుషులను చంపే చెట్లు కూడా ఉన్నాయి.
9. ప్రపంచంలో అతి పెద్దవైన అనకొండ లాంటి భారీ పాములు ఈ నదీపరివాహక ప్రాంతంలోనే జీవిస్తుంటాయి.
అనకొండ ప్రపంచంలోనే అతిపెద్ద విషం లేని సర్పము. ఇది ప్రపంచంలో అతి పెద్ద సర్పజాతి. దీని పేరును ఉపయోగించి అనేక సినిమాలను కూడా నిర్మించారు. అమెజాన్ నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. అనకొండ అనే పాము దక్షిణ అమెరికాలోనే అతి పెద్దది. 40 అడుగుల పొడవు ఉండి, దాదాపు వెయ్యి పౌండ్ల బరువు కలిగి ఉంటుంది. మనుషులను, జంతువులను తినే ఆరు రకాల పాములలో ఇది ముఖ్యమైనది. వీటికి ఆహారంగా దొరికిన మనుషులను, జంతువులను వాటి బలాన్ని ఉపయోగించి పూర్తిగా చుట్టి నలిపివేసి చంపి తింటాయి.
10. సముద్రాల్లో మాత్రమే జీవించే ప్రమాదకర సొరచేప (Bull Shark) అమెజాన్ నదిలో కూడా ఉంటుంది.
ఇవి ఉప్పు నీటిలో మరియు మంచి నీటిలో కూడా జీవించగలవు. అమెజాన్ నది యొక్క పై భాగంలోనే ఎక్కువగా తిరుగుతుంటాయి. గోరువెచ్చగా ఉండే నదీ తీరప్రాంతంలో ఇది ఎక్కువగా తిరుగుతుంటాయి. ఎందుకంటే అక్కడ మనుషులను దాడి చేసి చంపడానికి వీటికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఆడ బుల్ షార్క్ మగ బుల్ షార్క్ కంటే పొడవుగా ఉంటుంది. ఇవి వేటాడేటప్పుడు వాటికున్న శక్తినంతటిని ఉపయోగించి మనుషులను చంపేస్తాయి.
COMMENTS