World Party Day : పండగ చేస్కోండి.. ఈరోజు ప్రపంచ పార్టీ దినోత్సవం మరి!
World Party Day : మీకు తెలుసా.. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 3వ తేదీన అంటే ఈరోజున 'ప్రపంచ పార్టీ దినోత్సవం'గా జరుపుకుంటారు. మరి అసలే ఈరోజు ఆదివారం.. మీరు పార్టీ చేసుకుంటున్నారా?ప్రతి ఏడాది ఏప్రిల్ 3వ తేదీన అంటే ఈరోజు 'ప్రపంచ పార్టీ దినోత్సవం'గా జరుపుకుంటున్నారు. ఈ ఆలోచన మొదట 1996లో వచ్చింది, అప్పట్నించీ అది కొనసాగుతూ వస్తుంది. దీని వెనుక ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే.. ఒకరిపై ద్వేషాలు పెంచుకోకుండా, యుద్ధాలు చేసుకోకుండా. శాంతితో సామరస్యంగా అందరూ ఒకచోట చేరి వేడుక చేసుకోవాలి.
1996లో అమెరికాలో 'ఎ క్వాంటం ఫిక్షన్' అనే ఒక పాపులర్ నవల విడుదలైంది. ఈ నవలలో ప్రపంచంలోని ప్రజలందరూ ఒకేరోజు ఒకేసారి వేడుక జరుపుకుంటే ఎలా ఉంటుంది? అనే దానిపై ప్రసావించారు. దీంతో నిజంగా అలా జరిగితే బాగుంటుంది కదా? అని ఈ నవల చదివిన చాలా మంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారట.. ఇదే క్రమంలో శాంతి కోరుతూ 'ప్రపంచ పార్టీ దినోత్సవం' వేడుకను ఏప్రిల్ 3న నిర్వహించాలని పార్టీలు చేసుకోవడం ప్రారంభించడంతో అది అలా పాశ్చాత్య దేశాలలో పాపులర్ అయింది.
మరి ప్రపంచ పార్టీ డేను ఎలా జరుపుకోవాలి అంటే.. స్నేహితులను ఆహ్వానించి పార్టీ చేసుకోవచ్చు, కుటుంబ సభ్యులతో ఏదైనా రెస్టారెంటుకు వెళ్లి పార్టీ చేసుకోవచ్చు. ఆఫీసులో ఒకచోట పనిచేసే వారందరూ కలిసి పార్టీ చేసుకోవచ్చు.
అయినా పార్టీ చేసుకోవడం గురించి ఒకరు చెప్పాలా? అందుకు ప్రత్యేకంగా ఒక రోజు అని ఉండాలా? మన దేశంలో దావత్ అని అనుకుంటే ప్రతిరోజూ పండగే. ఏది ఏమైనా నలుగురితో కలిసి ఆనందంగా వేడుక జరుపుకోవడం కోసం ఒక సందర్భం కావాలి కాబట్టి ఈ ప్రపంచ పార్టీ దినోత్సవం రోజునే ఒక సందర్భంగా భావించి హ్యాప్పీగా పార్టీ చేసుకోండి.. చీర్స్!!
COMMENTS