CryptoCurrency అంటే ఏమిటి.. పూర్తిగా తెలుసుకోవాలా..!2022
What is CryptoCurrency? Want to know completely : CryptoCurrency గురించి
పూర్తిగా తెలుసుకోవాలని చూస్తున్నారా..! అయితే, ఈరోజు దీని గురించి
కంప్లీట్ గా చూద్దాం. CryptoCurrency అనేది
డిజిటల్ క్యాష్ మరియు దీన్ని పొందడానికి
మీరు రియల్ వరల్డ్ క్యాష్
ను వెచ్చించాల్సి వస్తుంది. క్రిప్టోకరెన్సీ యొక్క అత్యంత ముఖ్యమైన
విషయం ఏమిటంటే, ఈ క్యాష్ ను
ఒకరి నుండి మరొకరికి పంపడానికి
మరెవరి జోక్యం అవసరం ఉండదు.
ఇది యూజర్ నుండి యూజర్ కు నేరుగా చేరుతుంది మరియు ఎటువంటి ప్రోసెసింగ్ ఫీజ్ కూడా చెల్లించవలసిన అవసరం ఉండదు. నిజానికి, ఇది ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న అనేకమైన సిస్టమ్స్ తో అల్లుకొని వున్నా ఒక డీసెంట్రలైజ్డ్ టెక్నలాజి మరియు దీన్నే బ్లాక్ చైన్ అంటారు.
ప్రస్తుతం, ప్రపంచ వ్యాప్తంగా CryptoCurrency గురించి అనేకమైన సందేహాలు మరియు అపోహలు ఉన్నాయి. ఎందుకంటే, ప్రస్తుతం ఎక్కడ చూసిన CryptoCurrency హాట్ టాపిక్ మరియు డబ్బును ఇన్వెస్ట్ చెయ్యడానికి మంచి మార్గంగా మారుతుందని ఆలోచిస్తున్నారు. అయితే, క్రిప్టోకరెన్సీతో లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా ఉన్నాయి. అందుకే, ఈ రెండు విషయాలను గురించి చూద్దాం.
క్రిప్టోకరెన్సీతో లాభాలు:
- క్రిప్టోకరెన్సీ దేశాన్ని బట్టి విలువ మారదు
- క్రిప్టోకరెన్సీ యూజర్ నుండి యూజర్ కు నేరుగా పంపించవచ్చు.
- దీనికి, ఎటువంటి మధ్యవర్తులు అవసరం లేదు
- ట్రాన్స్ ఫర్ కోసం నామమాత్రపు ప్రోసెసింగ్ ఫీజ్ మాత్రమే ఉంటుంది
అంటే, ఈ పాయింట్స్ మీకు అర్ధమయ్యేలా ఉదాహరించి చెబుతాను: అమెరికాలో వున్న మీ ఫ్రెండ్ మీకు క్రిప్టోకరెన్సీ ని నేరుగా పంపించవచ్చు. వాస్తవానికి, రియల్ క్యాష్ ట్రాన్స్ ఫర్ విషయంలో డబ్బును మీకు ట్రాన్స్ ఫర్ చెయ్యాలంటే బ్యాంక్ లేదా మరింకేదైనా సంస్థ ద్వారా ఒక చట్టబద్దమైన పద్దతి ద్వారా మాత్రమే చెయ్యగలరు. దీనికోసం, మధ్య వర్తిగా వ్యవహరించిన బ్యాంక్ లేదా సంస్థకు మీరు ఎక్కువ మొత్తాన్ని ప్రోసెసింగ్ ఫీజ్ రూపంలో చెల్లించాల్సి వస్తుంది మరియు ఇది US డాల్సర్ నుండి ఇండియన్ కరెన్సీలో మారెప్పుడు విలువలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు.
క్రిప్టోకరెన్సీతో నష్టాలు:
- క్రిప్టోకరెన్సీ ధర ఎంత వేగంగా పెరుగుతుందో అంతే వేగంగా పడిపోతుంది
- క్రిప్టోకరెన్సీతో ఫ్రాడ్ మరియు మోసాలకు అవకాశం వుంది
- క్రిప్టోకరెన్సీ తప్పుగా ట్రాన్స్ ఫర్ చేస్తే తిరిగిపొందే ఛాన్స్ ఉండదు
- క్రిప్టోకరెన్సీ టోకెన్స్ కొనడం లాంటిది. మీరు కొన్న టోకెన్ మీకంటే ఎక్కువ ధర పెట్టి కొనేవారు ఉంటెనే మీకు లాభం వచ్చేది
- క్రిప్టోకరెన్సీ నుండి మీరు లాభాలను పొందితే దానికి టాక్సింగ్ నిర్వహణ సమస్య కూడా రావచ్చు
గమనిక: పైన తెలిపిన విషయాలు అన్ని కూడా కేవలం CryptoCurrency గురించి తెలియచేయడానికి మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఏవిధమైన ఇన్వెస్ట్ మెంట్ లేదా మరింకేదైనా లావాదేవీలను ఉధ్యేసించి ఎటువంటి ప్రకటన చెయ్యలేదు.
COMMENTS