మట్టి కుండలో నీళ్లు..ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు
Water in a clay pot has amazing health benefits : వేసవి ప్రారంభమైంది. ఈ సమయంలో ఫ్రిజ్ లో ఉన్న నీటి కంటే కుండ నీరు తాగడం ఎంతో మేలు. మార్కెట్లో కొన్ని చోట్ల ఈ మట్టి కుండలు లభిస్తున్నాయి. అలాగే ఇటీవల కాలంలో మట్టి పాత్రలతోపాటు.. మట్టి గ్లాసులు, మట్టి బాటిల్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఈ మట్టి కుండలలో నీళ్లు తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రయోజనాలివే:
- వేసవిలో కుండలోని నీరు తాగాడం వలన ఆరోగ్యానికి మంచిది. అలాగే గొంతుకు సంబంధించిన సమస్యలు రావు. జలుబు, దగ్గు సమస్యలను తగ్గిస్తుంది.
- సన్ స్ట్రోక్ ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సమస్య. వేసవికాలంలో చాలా మంది వడదెబ్బకు గురవుతుంటారు. మట్టికుండలోని నీటిలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండి శరీర గ్లూకోజ్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడతాయి.
- మట్టి కుండలో ఉండే నీరు తాగడం వలన శరీరానికి ఆమ్ల శాతం అందుతుంది.
- కడుపులో యాసిడిటి సమస్యను తగ్గుతుంది.
- మెటబాలిజం రేటు పెరుగుతుంది.
- టెస్టోస్టెరాన్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది.
- జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది.
- అతిగా దాహం వేయదు.
- శరీరాన్ని చల్లబరుస్తుంది.
COMMENTS