ఉదయాన్నే నిద్రలేచి ఇలా చేస్తే ఎన్నో లాభాలు
There are many benefits to waking up in the morning and doing this : ఉదయం లేవగానే చేసే పనులు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి.
- లేవగానే ఒకటీ, రెండు గ్లాసుల మంచినీరు తాగాలి. శరీరంలో హైడ్రేషన్ పెంచే నీటితో జీవక్రియను ప్రారంభిస్తే మేలు చేస్తుంది.
- అదనపు శక్తిని పెంచుకోవడానికి అప్పుడప్పుడు నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగాలి.
- ఉదయం ధ్యానానికి 10 నిమిషాల సమయం కేటాయిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది.
- ఒంటికి తగినంత సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి.
- శరీరానికి తప్పనిసరిగా శ్రమను అలవాటు చేయాలి.
- పొద్దున్నే భారీ బరువులు మోయకూడదు, తేలికపాటి బరువులు మోయాలి. శరీరంలో రక్త ప్రసరణ పెరిగితే స్ట్రెచింగ్ ఎక్సర్సైజులు చేస్తే బాగుంటుంది.
- ప్రోటీన్లతో నిండిన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. ఇది రోజంతా శక్తినిస్తుంది.
- ఇష్టపడే వ్యక్తులతో ఉదయం కొద్దిసేపు గడపాలి. కుటుంబంతో కలిసి టిఫిన్ తినడం, స్నేహితులతో కలిసి వ్యాయామం చేయడం మంచిది.
- ఉదయాన్నే బొమ్మలు గీయడం, చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, పెరటి తోటల పర్యవేక్షణ చేయడంతో ఉల్లాసంగా ఉంటుంది.
- ఉదయం లేవగానే ఫోన్ తీసుకొని ఇతరుల స్టేటస్, టెక్ట్స్ చూడొద్దు. అలా చేస్తే ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఇతరుల ఆలోచనలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. మీ వ్యక్తిగత అభిప్రాయాలు, ఆలోచనలు పక్కదారి పడుతాయి.
- ఉదయం 8 గంటలలోపు అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. ఇలా చేస్తే అనుకున్న విజయాలు సాధించడానికి
వీలవుతుంది.
COMMENTS