గుమ్మడికాయ వల్ల ఎన్నో ప్రయోజనాలు
There are many benefits of pumpkin : గుమ్మడికాయలో బీటా కెరొటిన్ ఎక్కువగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్గా పనిచేసే ఇది ఒంట్లోకి చేరుకున్నాక విటమిన్ ఎ రూపంలోకి మారిపోతుంది. అరకప్పు గుమ్మడి ముక్కలతోనే మనకు రోజుకు అవసరమైన విటమిన్ ఎ లభిస్తుంది.
- కళ్లు బాగా కనబడటానికి, పునరుత్పత్తి అవయవాలు సజావుగా పనిచేయటానికి విటమిన్ ఎ చాలా అవసరం.
- కొన్నిరకాల క్యాన్సర్ల ముప్పు తగ్గటానికీ విటమిన్ ఎ తోడ్పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
- బీటా కెరొటిన్తో పాటు విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, ఫోలేట్ కూడా గుమ్మడిలో ఎక్కువగానే ఉంటాయి. ఇవన్నీ రోగనిరోధకశక్తిని బలోపేతం చేస్తాయి. అందువల్ల ఇది ఇన్ఫెక్షన్ల బారినపడకుండా కాపాడుతుంది.
- గుమ్మడి ముక్కల్లోని పొటాషియం రక్తపోటు తగ్గటంలోనూ సాయపడుతుంది. ఫలితంగా పక్షవాతం ముప్పు కూడా తగ్గుతుంది.
- గుమ్మడి గింజల్లో బోలెడన్ని ఖనిజాలుంటాయి. కొలెస్ట్రాల్ మాదిరి వృక్ష స్టెనాల్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి మంచి కొవ్వు స్థాయులు పెరిగేలా చేస్తాయి.
- గుమ్మడిలో పీచు ఎక్కువగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉన్నాయి. ఇలా ఇది త్వరగా ఆకలి వేయకుండా, బరువు పెరగకుండా చూస్తుంది. పీచుతో మలబద్ధకం కూడా దూరమవుతుంది.
- గుమ్మడి గింజల్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది సెరటోనిన్ అనే రసాయనం ఉత్పత్తి కావటానికి తోడ్పడుతుంది. సెరటోనిన్ నిద్ర బాగా పట్టేలా చేస్తుంది.
COMMENTS