ప్లాస్టిక్ వాడకంతో ఆ ఎఫెక్ట్..అలర్ట్ వారికి ఆ డేంజర్
That effect with the use of plastic..that danger for those on alert: ప్లాస్టిక్ కవర్స్ ను, బ్యాగ్స్ ను
కాల్చినప్పుడు అవి మండే పొగలో విడుదలయ్యే వాయివులు క్యాన్సర్ కారకాలు. అందులో
ముఖ్యంగా తీసుకుంటే..లెడ్, కార్భైన్ మోనాక్సైడ్ లాంటివి ఎక్కువ రిలీజ్ అవుతాయి. ఈ
రెండు వాయువులు పీలిస్తే ఊపిరిత్తులు డామేజ్ అవుతాయి. శ్వాసకోస సంబంధిత వ్యాధులు
ఎక్కువ వస్తాయి.
మండే కొద్ది ఇంకా ఆర్సినిక్, నికిల్ కూడా రిలీజ్ అవుతుంది. ఇవన్నీ అనేక రకాల క్యాన్సర్ కు, రక్తాన్ని పాడుచేయడానికి, బోన్ మ్యారోను డామేజ్ చేయడానికి కారకాలు. ప్లాస్టిక్ కాల్చినప్పుడు వచ్చే పొగను పీల్చటం చాలా ప్రమాదకరం. ఒక్కోసారి ఈ పొగనుంచి వచ్చిన వాయిువులు చెట్లమీద కానీ, నేల మీద కానీ ఉండిపోతాయి. ఇవి కాస్తా మనకు తెలియకుండానే నీళ్లలోకి, ఆహారాల్లోకి వచ్చేస్తాయి. అలా కలుషితం చేస్తాయి.
ప్లాస్టిక్ వాటర్ బాటిల్ లో వేడినీళ్లు పోసుకుని తాగినా ప్రమాదమే. ఇది శరీరంలో ఎక్కువ వెళ్లేకొద్ది మగవారికి వీర్యకణాలు తగ్గుతాయి. ఆడవారికి ఈస్ట్రోజన్ హార్మోన్ ఫ్లక్యూవేషన్స్ వచ్చేస్తాయి. అంటే ఈ ప్లాస్టిక్ సంతానం మీద దెబ్బకొడుతుంది. ఇంకా ఈ కెమికల్స్ వల్ల హార్ట్ ఎటాక్స్ వస్తాయట, రక్తనాళాల్లో ఈ కెమికల్స్ పేరుకుంటాయి.
ఇందులో ఉండే బెంజీన్ అనేది ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేసే బోన్ మారోను
దెబ్బకొడుతుంది. మెదడు కణాల్లో డీఎన్ఏ ను డామేజ్ చేసే గుణం కూడా బీపీఏ కెమికల్ కు
ఉంది. పుట్టబోయే బిడ్డలమీద కూడా ఈ బీపీఏ కెమికల్ ప్రభావం.. తల్లిద్వారా బిడ్డకు
వెళ్లి వాళ్లకు కూడా నష్టం జరుగుతుంది. ఎక్కువ మంది చెప్పేది ఇందులో వాడే భారీ
లోహాల కారణంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయట. ఈ రోజుల్లో క్యాన్సర్
ఎక్కువగా పెరగటానికి వీటి వాడకం కూడా ఒక కారణమే.
COMMENTS