సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట వేయండిలా
Prevent seasonal diseases : చలికాలంలో వాతావరణ మార్పుల కారణంగా
జలుబు, దగ్గు, ఫ్లూ సహా చర్మ వ్యాధులు, ఆస్తమా, కీళ్ల నొప్పులు, చిన్నారుల్లో
విరేచనాలు, వైరల్ జ్వరాలు మనల్ని ఆందోళనకు గురిచేస్తాయి. వీటికి బ్యాక్టీరియా,
వైరస్లు ప్రధాన కారణం. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో
ఇప్పుడు తెలుసుకుందాం.
- జలుబు ఉన్నవారు తుమ్మినా, చీదినా, దగ్గినా పక్కన ఉన్నవారు ముక్కును, నోరును
కవర్ చేసుకోకపోతే ఆ గాలిని పీల్చినప్పుడు వారికి కూడా ఆ వైరల్ ఇన్ఫెక్షన్
వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
- బట్టలు, వస్తువులు లాంటివి షేర్ చేసుకోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం లాంటివి
చేయకూడదు. అలాంటివి చేస్తే ఒకరి నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. జలుబు
చేసినప్పుడు ఇతరులకు కొంచెం దూరంగా ఉండాలి.
- ఉదయాన్నే వ్యాయామం చేయాలి. సరైన వ్యాయామం లేకపోతే రక్త ప్రసరణ సరిగ్గా జరగక
కీళ్ల నొప్పులు ఎక్కువ అవుతాయి.
- చిన్నపిల్లల్లో విరేచనాలు తగ్గాలంటే పుట్టిన 7, 8 నెలల్లో వ్యాక్సిన్
తప్పనిసరిగా వేయించాలి.
- డెంగీ, మలేరియా వంటి వైరల్ జ్వరాల బారినపడకుండా ఉండాలంటే.. ఒళ్లంతా కప్పి ఉంచే
దుస్తులు ధరించాలి. నీరు నిల్వ ఉండేవాటిని రోజూ మారుస్తూ ఉండాలి. దోమతెరలను
వాడాలి. లార్వాలను నాశనం చేసే రసాయనాలను పిచికారీ చేస్తుండాలి. ఒడోమస్ లేపనం
పూసుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
- చర్మానికి తగినంత సూర్యరశ్మి అందితే ఎముకలకు మేలు జరగుతుంది. ఎముకలకు, చర్మ
సమస్యలకు ఉపయోగపడేలా ఐరన్, క్యాల్షియం, పీచు, కొవ్వులు, కార్బొహైడ్రేట్లు వంటి
పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే చలికాలంలోనూ మన
ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది.
COMMENTS