పోస్టాఫీస్ స్కీమ్ రూ.40 లక్షలు పొందండిలా
Post Office Scheme Get Rs. 40 lakhs: పోస్టాఫీస్ అందిస్తున్న స్కీమ్స్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్) పథకం కూడా ఒకటి. ఈ పీపీఎఫ్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు ఉంటుంది. ఈ స్కీమ్ పై ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ వడ్డీ రేటు మారుతూ ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను సమీక్షిస్తూ ఉంటుంది.
ఈ పథకంలో ఇన్వెస్ట్మెంట్లకు ఒక లిమిట్ ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి వీలుంటుంది. అంటే నెలకు రూ.12,500 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. అంటే రోజుకు దాదాపు రూ.410 వరకు పొదుపు చేయాల్సి ఉంటుంది. అలాగే ఏడాదిలో రూ.500 ఇన్వెస్ట్ చేసినా అకౌంట్ కొనసాగుతుంది.
మీరు రోజుకు రూ.400 పొదుపు చేసి నెల చివరిలో ఆ మొత్తాన్ని ఒకేసారి పీపీఎఫ్ ఖాతాలో ఇన్వెస్ట్ చేయాలి. ఇలా చేస్తే మెచ్యూరిటీ తర్వాత మీ చేతికి రూ.40 లక్షలకు పైగా వస్తాయి.
ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం రూ.22.5 లక్షలు అవుతుంది. మీకు వచ్చే రాబడి రూ.18.18 లక్షలుగా ఉంటుంది. అంటే చేతికి రూ.40.68 లక్షలు వస్తాయి. ఈ స్కీమ్ వల్ల పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
COMMENTS