రాత్రి పడుకునే ముందు ఒక్క యాలక్కాయ్
One Cardamom before going to bed at night: సాధారణంగా మన వంటింట్లో యాలకులు తప్పకుండా ఉంటాయి. కొన్ని రకాల వంటకాల్లో, మసాలాల్లో, టీలో యాలకులను ఉపయోగిస్తుంటాము. యాలకులు మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో వుంది. అయితే రాత్రి పడుకునే ముందు ఒక యాలక్కాయ తిని గోరువెచ్చని నీళ్ళు తాగితే చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ప్రతిరోజు ఇలా రాత్రి వేళల్లో తీసుకుంటే మనకు ఇక మెడిసిన్స్‌తో అవసరం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈమధ్య కాలంలో బరువును తగ్గించుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో రకమైన ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే బరువు సింపుల్‌గా తగ్గాలనుకునేవారు ప్రతిరోజు రాత్రి ఒక యాలక్కాయి తిని ఒక గ్లాసు వేడి నీళ్ళు తాగడం వల్ల వారి శరీరంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుంది. దీంతో అధిక బరువును, శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అంతేకాదు శరీరంలోని చెడు పదార్థాలు కూడా తొలగిపోయి రక్తప్రసరణ సజావుగా జరుగుతుంది. అన్ని అవయవాలను శుద్థి చేసి కాపాడుతాయి.
మనం తీసుకునే పదార్థాలలో చాలా జీర్ణం కాక అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు వస్తుంటాయి. దీని కారణంగా అనేకమంది మలబద్ధక సమస్యతో బాధపడుతుంటారు. అలాంటివారు ఒక యాలకను తిని గోరువెచ్చని నీరు తాగితే ఆ సమస్య నుంచి బయటపడతారు. అంతేకాదు రాత్రి వేళల్లో సరిగ్గా నిద్రపట్టని వారికి కూడా యాలకులు మంచి ఔషధంలా పనిచేస్తుంది.
COMMENTS