ఎల్ఐసీ పాలసీ.. రూ.10 లక్షల వరకు పొందండిలా
LIC policy Get up to Rs 10 lakh: ఎల్ఐసీ అందిస్తున్న పాలసీల్లో ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీ ఒకటి. ఈ పాలసీలో రోజుకి కేవలం రూ.73 ఇన్వెస్ట్ చేయడం ద్వారా పాలసీ మెచ్యూరిటీ సమయంలో మీరు రూ.10 లక్షల వరకు పొందవచ్చు. అంతేకాక, జీవితకాల ప్రమాద బీమాను కూడా పాలసీ హోల్డర్లు పొందుతారు.
ఈ పాలసీలో చేరాలంటే కనీస వయసు 18 ఏళ్ల వయసు ఉండాలి. గరిష్ట వయసు 50 ఏళ్లు ఉండాలి. గరిష్టంగా మెచ్యూరిటీ అయ్యే వయసు 75 ఏళ్లు. కనీస పాలసీ టర్మ్ 15 ఏళ్లు ఉంటుంది. గరిష్ట పాలసీ టర్మ్ 35 ఏళ్లు. ప్రీమియం పేమెంట్ విధానం వార్షికం, అర్థ వార్షికం, త్రైమాసికం, నెలవారీగా ఉంటుంది. ఈ పాలసీ కింద మినిమమ్ బేసిక్ సమ్ అస్యూర్డ్ రూ.లక్ష వరకు ఉంటుంది. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఈ పాలసీపై రుణ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. ప్రీమియం చెల్లింపు సమయంలో, మీరు లోన్ తీసుకుంటే, సరెండర్ వాల్యుపై 90 శాతం క్రెడిట్ అందుబాటులో ఉంటుంది. పాలసీ టర్మ్లో పాలసీహోల్డర్లకు డెత్ బెనిఫిట్ కూడా ఉంటుంది. నామినీకి బేసిక్ సమ్ అస్యూర్డ్లో 125 శాతం లేదా యాన్యువల్ ప్రీమియంలో ఏడింతలు వస్తాయి. పాలసీ టర్మ్ అయిపోయిన తర్వాత పాలసీహోల్డర్లు మరణిస్తే నిర్దేశిత మెచ్యూరిటీ తేదీ నుంచి నామినీకి ప్రయోజనాలు లభిస్తాయి.
ఉదాహరణకు మీరు 24 ఏళ్ల వయసులో రూ.5 లక్షల సమ్ అస్యూర్డ్తో న్యూ జీవన్ ఆనంద్ పాలసీ కొనుగోలు చేస్తే పాలసీ టర్మ్ 21 ఏళ్లు ఉంటుంది. మీ వార్షిక ప్రీమియం రూ.26,815. అంటే రోజుకు సుమారు మీరు రూ.73.50 ఇన్వెస్ట్ చేయాలి. దీంతో మీ ఇన్వెస్ట్మెంట్ సుమారు రూ.5.63 లక్షలవుతాయి. మీరు పెట్టిన ఈ ఇన్వెస్ట్మెంట్కి మెచ్యూరిటీ సమయంలో బోనస్తో కలుపుకుని రూ.10.33 లక్షలు పొందవచ్చు.
COMMENTS