చెమటకాయల సమస్యకు చెక్ పెట్టండిలా
Keep a check for the sweat problem : వేసవిలో శరీరంలో నుంచి ఎక్కువ మొత్తంలో నీరు చెమట రూపంలో బయటికి పోతుంది. ఈ క్రమంలో చాలామందిని చెమటకాయల సమస్య వేధిస్తూ ఉంటుంది. ఇవి ఎక్కువగా ముఖం, మెడ, వీపు, పొట్ట, చేతులు మొదలైన భాగాల్లో ఏర్పడతాయి. ఈ క్రమంలో బయట దొరికే పౌడర్లు, క్రీములు వద్దనుకునేవారు ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
- చెమటకాయలు ఏర్పడినప్పుడు చల్లటి ఐస్ ముక్కలు శరీరానికి ఉపశమనాన్నిస్తాయి. చిన్నచిన్న ఐస్ముక్కల్ని ఎర్రగా ఉన్న చెమటకాయలపై రుద్దాలి. ఇలా చేస్తే మంట తగ్గిపోయి తద్వారా చెమటకాయలూ తగ్గుతాయి.- కొన్ని వేపాకుల్ని తీసుకుని నీళ్లు పోస్తూ మెత్తటి పేస్ట్లా నూరుకోవాలి. ఈ పేస్ట్ని చెమటకాయలున్న చోట పూసి పూర్తిగా ఆరనివ్వాలి. వేపలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాల వల్ల శరీరంపై ఉండే క్రిములు నాశనమై ఏవైనా ఇతర చర్మవ్యాధులుంటే కూడా తొలగిపోతాయి.
- చందనం పొడి, కొత్తిమీర పొడి ఈ రెండింటినీ ఒక్కోటి 2 టేబుల్ స్పూన్ల చొప్పున తీసుకోవాలి. ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల రోజ్వాటర్ వేసి మృదువైన పేస్ట్ వచ్చే వరకు బాగా కలపాలి. ఈ పేస్ట్ ని చెమటకాయలున్న చోట పూయాలి. ఆరిపోయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగేయాలి.
- నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల చెమటకాయలు తగ్గిపోతాయి. రోజుకు 4 గ్లాసుల నిమ్మరసం తాగితే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
- కలబంద గుజ్జును చెమటకాయలుండే చోట కాసేపు పెట్టి ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో స్నానం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
చెమటకాయలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..
- - వేడి ఎక్కువగా ఉండే సమయాల్లో నీళ్లు బాగా తాగాలి.
- - శరీరానికి వదులుగా ఉండే దుస్తుల్ని ధరించాలి.
- - చర్మాన్ని ఎప్పుడూ తాజాగా ఉంచుకోవాలి.
- - స్నానానికి రసాయనాలు ఎక్కువగా ఉండే సబ్బులు ఉపయోగించకూడదు.
- - పడుకునే గదిలో చల్లగా, బాగా గాలి ఆడేలా వెంటిలేషన్ ఉంచుకోవాలి.
- - వాతావరణంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు చల్లగా ఉండే లేదా గాలి ఎక్కువగా ప్రసరించే ప్రదేశంలో ఉండటం మంచిది.
COMMENTS