ATM Card లాంటి ఆధార్ కార్డ్ కావాలా..!
If you want an Aadhaar card like ATM Card: భారతదేశంలో ఎటువంటి అవసరానికైనా ఫస్ట్ అడిగే ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డ్. ఎక్కడికెళ్లినా ఆధార్ కార్డ్ ని జేబులో ఉంచుకోవడం మంచిది. అందుకే, ఈజీగా క్యారీ చెయ్యడానికి వీలుగా ఉండే ATM లాంటి ఆధార్ కార్డ్ ఇంటి వద్దకే తెప్పించుకోండి. UIDAI కొత్త సంవత్సరంలో ఆధార్ కార్డ్ పైన కొత్త విధానం ప్రవేశపెట్టింది. అదే, PVC Aadhaar Card.
ముందుగా, అందరికి అందించిన ఆధార్ కార్డ్ కేవలం ప్రింటెడ్ పేపర్ మాత్రమే. అందుకోసమే, ఈ PVC Aadhaar Card విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది ATM కార్డ్ మాదిరిగా ఉంటుంది మరియు ఎక్కడైనా తీసుకెళ్లడానికి వీలుగా మీ జేబులో లేదా వాలెట్ లో సరిపోతుంది. ఈ PVC Aadhaar Card కోసం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు కేవలం రూ. 50 చెల్లిస్తే సరిపోతుంది.
PVC ఆధార్ కార్డు కోసం ఎలా అప్లై చెయ్యాలి?
PVC ఆధార్ కార్డు కోసం అప్లై చెయ్యడం చాలా సులభం. దీనికోసం, UIDAI పోర్టల్ కి వెళ్లి My Aadhaar ట్యాబ్ నుండి మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ తో PVC ఆధార్ కార్డు కోసం అప్లై చెయ్యవచ్చు.
1. https://uidai.gov.in/ వెబ్సైట్ కి వెళ్ళండి
2. MyAadhaar ట్యాబ్ పైన నొక్కండి
3. ఆర్డర్ ఆధార్ PVC కార్డ్ పైన నొక్కండి
4. ఇక్కడ కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది
5. ఇక్కడ మీ ఆధార్ నంబర్/వర్చువల్ ID/ EID తో లాగిన్ అవ్వండి
6. OTP మీ రిజిస్టర్ నంబర్ కు వస్తుంది.
ఈ విధంగా కేవలం రూ. 50 చెల్లించి మీ రిజిష్టర్ మొబైల్ ద్వారా మీ ఇంటి వద్దకే ATM కార్డ్ వంటి ఆధార్ PVC కార్డు ను తెప్పించుకోవచ్చు. దీనికోసం మీరు ఎక్కడికి వెళ్ల్సిన అవసరం లేదు. మీ స్మార్ట్ ఫోన్ ఉపయోగించి చాలా సింపుల్ గా ఆర్డర్ చేయవచ్చు.
COMMENTS