రోజుకు రూ.230 పొదుపు చేస్తే చేతికి రూ. 17 లక్షలు!
If you save Rs 230 per day, you will save Rs. 17 lakhs: ఎల్ఐసీ అందించే స్కీమ్స్లో "జీవన్ లాభ్" కూడా ఒకటి. ఈ స్కీమ్ వల్ల ప్రాఫిట్, ప్రొటెక్షన్ రెండూ లభిస్తాయి. 8 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ టర్మ్ 16 నుంచి 25 ఏళ్ల వరకు ఉంటుంది. కనీసం రూ.2 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకోవాలి. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. మీకు నచ్చిన బీమా మొత్తానికి పాలసీ తీసుకోవచ్చు. మూడేళ్ల తర్వాత లోన్ తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. చెల్లించిన ప్రీమియం మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు.
పాలసీదారుడు జీవించి ఉంటే పాలసీ డబ్బులు, బోనస్ వంటివి మెచ్యూరిటీ తర్వాత అందిస్తారు. ఒకవేళ మరణిస్తే నామినీ లేదా కుటుంబ సభ్యులకు పాలసీ డబ్బులు వస్తాయి. 20 ఏళ్ల వయసులో ఉన్న వారు 16 ఏళ్ల టర్మ్తో రూ.10 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకుంటే నెలకు రూ.7 వేల వరకు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. అంటే రోజుకు రూ.230 ఆదా చేస్తే సరిపోతుంది. పదేళ్లు ప్రీమియం కట్టాలి. మెచ్యూరిటీ సమయంలో చేతికి రూ.17 లక్షలకు పైగా పొందొచ్చు.
COMMENTS