ఈ బిజినెస్ తో మంచి లాభాలు
Good profits with this business: తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు చాలా ఉన్నాయి. వాటిలో పచ్చళ్ల వ్యాపారం కూడా ఒకటి. ఈ వ్యాపారాన్ని ఇంట్లోనే ప్రారంభించొచ్చు. కేవలం రూ.10,000 పెట్టుబడితో ఈ వ్యాపారం ప్రారంభించొచ్చు. వ్యాపారం పుంజుకున్న తర్వాత ఎక్కువ పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. ఇలాంటి చిరు వ్యాపారాలు చేయాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం కూడా లభిస్తుంది. చిన్న వ్యాపారాలకు బ్యాంకుల నుంచి లోన్ కూడా లభిస్తుంది. మొదట రూ.10,000 పెట్టుబడితో పచ్చళ్ల వ్యాపారం ప్రారంభించి ఆ తర్వాత బ్యాంకులు, ప్రభుత్వ రుణ పథకాల సహకారంతో వ్యాపారాన్ని విస్తరించొచ్చు. ముద్ర లోన్, ఎంఎస్ఎంఈ రుణాలకు దరఖాస్తు చేయొచ్చు.
ఈ వ్యాపారం చేయడానికి పచ్చళ్లను తయారు చేయడం తెలిసి ఉండాలి. ముడిసరుకు కోసం రూ.10,000 పెట్టుబడి ఉంటే సరిపోతుంది. మంచి రుచితో పాటు ప్యాకేజింగ్‌తో కస్టమర్లను ఆకట్టుకోవాలి. ఆన్లైన్, ఆఫ్ లైన్ లో కూడా పచ్చళ్లు అమ్ముకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్ బాస్కెట్ లాంటి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో ఎక్కువ మంది పచ్చళ్లను కొంటుంటారు. ఇలాంటి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో పచ్చళ్లను అమ్ముకోవచ్చు. అలాగే రీటైల్ మార్కెట్లు, రీటైల్ చైన్స్ ద్వారా పచ్చళ్లను అమ్మొచ్చు.
పచ్చళ్ల వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఎక్కువ విస్తీర్ణం ఉన్న స్థలం అవసరం లేదు. కేవలం 900 చదరపు అడుగుల స్థలం ఉంటే చాలు. పచ్చళ్లను తయారు చేయడం, ముడిసరుకును ఆరబెట్టడం, పచ్చళ్లను ప్యాక్ చేయడం, స్టోర్ చేయడం లాంటివన్నీ ఈ స్థలంలోనే చేయొచ్చు. పచ్చళ్లు పాడవకుండా జాగ్రత్తపడాలి.
పచ్చళ్ల వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఈ వ్యాపారం ద్వారా నెలకు రూ.30,000 ఆదాయం కూడా పొందొచ్చు. సేల్స్ ఎక్కువగా ఉంటే పెట్టుబడి పెంచుకుంటే మరింత లాభం ఉంటుంది. అయితే ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే పచ్చళ్లను తయారు చేయడంతో పాటు మార్కెటింగ్ వంటి అంశాలపై పూర్తి అవగాహన ఉండాలి. మీరు వ్యాపారానికి సంబంధించిన అనుమతులతో పాటు ఆహారపదార్థాలకు సంబంధించిన బిజినెస్ కాబట్టి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ తీసుకోవాలి. ఆన్లైన్లో ఈ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయొచ్చు.
COMMENTS