ఈ కోళ్ల పెంపకంతో మంచి లాభాలు
Good profits with raising these chickens: సొంతంగా
ఏదైనా వ్యాపారం చేయాలనుకునే వారికి రాజశ్రీ కోళ్ల పెంపకం ఒక
మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ
కోళ్లను పెంచడానికి బయట ఎక్కడో ఫారం
అక్కర్లేదు. ఇంటి పెరట్లోనే పెంచవచ్చు.
రాజశ్రీ కోళ్లు మధ్యరకంగా ఉంటాయి. వీటికి పొడవైన కాళ్లు ఉంటాయి. వేగంగా పరిగెడతాయి. కుక్కలు, పిల్లులకు దొరకవు. ఈ కోళ్లు పెట్టే
గుడ్ల బరువు నాటు కోడి
గుడ్డు బరువు కంటే ఎక్కువగా
ఉంటుంది. ఈ కోళ్లు ఎక్కువ
కాలం బతుకుతాయి.
మీరు రాజశ్రీ కోడి పెట్ట పిల్లలను తెస్తే 5 నెలల్లో ఒక్కో పెట్ట కేజీ 100 గ్రాములు పెరుగుతుంది. రాజశ్రీ కోడి 5 నెలల తర్వాత మొదటిసారి గుడ్డు పెడుతుంది. రాజశ్రీ కోడి 17 నెలల్లో దాదాపు 160 గుడ్లు పెడతాయి. ఆ రోజే పుట్టిన రాజశ్రీ కోడి పిల్లలను ఇంటికి తెచ్చుకోవచ్చు. 6 నెలలపాటూ వాటికి కరెంటు లైట్లతో కాస్త వేడిని అందించాలి. అప్పటివరకూ వాటిని గంపల్లో లైటింగ్ పెట్టి పెంచవచ్చు. ఆ తర్వాత పెరట్లో వదలవచ్చు. పెరట్లో వదిలాక ఇక లైటింగ్ అవసరం లేదు.
కోడి పిల్లలను తెచ్చాక మొదటి 6 నెలల కాలంలో ఓసారి డీవార్మింగ్ కోసం పైపరిజిన్ మందును ఒక చెంచా లెక్కన అరలీటరు నీళ్ళలో కలిపి ఒక్కో కోడికి 5 నుంచి 10 మిల్లీలీటర్లు తాగించాలి. దీనివల్ల వాటి కడుపులో ఉండే పురుగులు చనిపోతాయి. పెరటిలో పెరిగే కోళ్లకు వ్యాధులు రాకుండా చేయడానికి టీకాలు ఇప్పించాల్సి ఉంటుంది. వీటికి మొదట్లో లేయర్ కోడిపిల్లలకు ఇచ్చే దాణానే ఇవ్వాలి. ఆ తర్వాత పెరట్లో దొరికే పచ్చిగడ్డి, క్రిములు సహజంగా లభించే పదార్థాలే కాకుండా కిచెన్లో వ్యర్థాలు, వివిధ రకాల గింజ ధాన్యాలు, నూకలు వంటివి ఇవ్వొచ్చు. లూసర్న్ లేదా బర్సీమ్ లాంటి పశుగ్రాసాలు చిన్న ముక్కలుగా చేసి ఇస్తే తింటాయి.
ఈ కోళ్లు గుడ్లను పొదగవు. గుడ్డు వచ్చాక నాటు కోడి ద్వారా పొదిగించవచ్చు లేదా ఇంక్యుబేటర్ ద్వారా పిల్లను చెయ్యవచ్చు. ఈ కోడి కేజీ ధర మార్కెట్లో రూ.500 దాకా పలుకుతోంది. దాణా ఖర్చులు పెద్దగా ఉండవు కాబట్టి మంచి లాభాలే వస్తాయని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఉన్న అఖిల భారత కోళ్ళ పరిశోధన సంస్థ నుంచి పొందవచ్చు. ఫోన్ నంబర్ - 040-24015316.
COMMENTS