'ఫ్లై యాష్ బ్రిక్స్' బిజినెస్ తో మంచి లాభాలు
Good profits with the 'Fly Ash Bricks' business : ప్రస్తుత కాలంలో చాలా మంది సొంతంగా బిజినెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అలాంటి వారికి 'ఫ్లై యాష్ బ్రిక్స్' బిజినెస్ కూడా ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. సొంత భూమి ఉండి, తక్కువ పెట్టుబడితో మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, మీరు ఫ్లై యాష్ బ్రిక్స్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇందుకోసం 100 గజాల స్థలం, కనీసం రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీంతో మీరు ప్రతి నెలా రూ.లక్ష సంపాదించవచ్చు. ప్రస్తుత కాలంలో బిల్డర్లు ఫ్లై యాష్‌తో చేసిన ఇటుకలను మాత్రమే ఉపయోగిస్తున్నారు. దీంతో వాటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆ బిజినెస్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.
ఈ ఇటుకలను విద్యుత్ ప్లాంట్ల నుంచి వెలువడే బూడిద, సిమెంట్, రాతి ధూళి మిశ్రమంతో తయారు చేస్తారు. ఈ వ్యాపారం కోసం మీరు యంత్రాలపై ఎక్కువ పెట్టుబడిని పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇందుకు వినియోగించే మాన్యువల్ యంత్రాన్ని సుమారు 100 గజాల స్థలంలో ఉంచొచ్చు. ఈ యంత్రం ధర సుమారుగా రూ.1.50 లక్షలు ఉంటుంది. ఈ యంత్రం ద్వారా ఇటుక ఉత్పత్తి చేయడానికి 5 నుండి 6 మంది వ్యక్తులు అవసరం. దీంతో రోజుకు దాదాపు 3 వేల ఇటుకలను ఉత్పత్తి చేయవచ్చు. ఒక్కో ఇటుక ధర రూ.5 నుంచి రూ.10 వరకు ఉంటుంది.
ఈ వ్యాపారంలో ఆటోమేటిక్ మెషీన్ల ఉపయోగిస్తే ఎక్కువ ఉత్పత్తితో పాటు, ఆదాయాన్ని పొందొచ్చు. అయితే ఈ ఆటోమేటిక్ మిషన్ ధర రూ.10 నుంచి 12 లక్షల వరకు ఉంటుంది. ఇలాంటి యంత్రం ఉంటే పని వేగవంతగా జరుగుతుంది. ఆటోమేటిక్ మెషీన్ ద్వారా గంటలో 1000 ఇటుకలను తయారు చేయవచ్చు. అంటే ఈ యంత్రం సహాయంతో మీరు నెలలో 3 నుండి 4 లక్షల ఇటుకలను తయారు చేయవచ్చు. బ్యాంకు నుంచి రుణం తీసుకుని కూడా ఈ బిజినెస్ ను ప్రారంభించవచ్చు. ఇందు కోసం ముందుగా బ్యాంకులను సంప్రదించి రుణాలను పొందొచ్చు. ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల నుంచి కూడా రుణాలను తీసుకోవచ్చు.
COMMENTS