ప్రతి నెలా రూ.10 వేలు పొందండిలా
Get 10 thousand Rupees every month: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ స్కీమ్స్ లో అటల్ పెన్షన్ యోజన కూడా ఒకటి. ఇందులో చేరితే 60 ఏళ్ల తర్వాత ఆర్థిక ఇబ్బందులు పడాల్సిన పని లేదు. 18 నుంచి 40 ఏళ్ల వయసులో ఉన్న వారు ఈ స్కీమ్‌లో చేరేందుకు అర్హులు. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ ఈ పథకంలో చేరొచ్చు. ఈ స్కీమ్‌లో చేరిన వారు ప్రతి నెలా కొంత మొత్తం చెల్లిస్తూ వెళ్లాలి. 60 ఏళ్లు వచ్చే వరకు డబ్బులు కట్టాలి. తర్వాత మీకు ప్రతి నెలా డబ్బులు వస్తాయి.
బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి ఈ పథకంలో జాయిన్ అవ్వొచ్చు. కనీసం రూ.1000 పెన్షన్ వస్తుంది. గరిష్టంగా రూ.5 వేలు వరకు పొందొచ్చు. రూ. 2 వేలు, రూ.3 వేలు, రూ.4 వేలు చొప్పున కూడా పెన్షన్ తీసుకునే వెసులుబాటు ఉంది. మీరు ప్రతి నెలా చెల్లించే మొత్తం ప్రాతిపదికన మీకు ఎంత పెన్షన్ వస్తుందనే అంశం నిర్ణయమౌతుంది.
ఉదాహరణకు 18 ఏళ్ల వయసులో స్కీమ్‌లో రూ.5 వేల పెన్షన్ కోసం నెలకు రూ.210 చెల్లించాల్సి ఉంటుంది. రూ.1000కు అయితే రూ.42, రూ.2 వేలకు రూ.84, రూ.3 వేలకు రూ.126, రూ.4 వేలకు రూ.168 కట్టాలి. ఈ స్కీమ్‌లో చేరిన వారికి జీవితాంతం పెన్షన్ వస్తుంది. సబ్‌స్క్రైబర్ మరణిస్తే భాగస్వామికి పెన్షన్ వస్తుంది. ఇద్దరూ మరణిస్తే నామినీకి ఫండ్ డబ్బులు చెల్లిస్తారు. ఉదాహరణకు కొత్తగా పెళ్లి చేసుకున్న వారు 24 ఏళ్ల వయసులో ఉన్న ఈ పథకంలో చేరితే రూ.22 పొదుపుతో రూ.10 వేలు పొందొచ్చు. అంటే ఇద్దరూ అటల్ పెన్షన్ స్కీమ్ లో చేరాలి. రూ.5 వేల పెన్షన్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు నెలకు రూ.346 కట్టాలి. ఇద్దరికి దాదాపు రూ.700 అవుతుంది. అంటే రోజుకు రూ.22 పొదుపు చేస్తే సరిపోతుంది. 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా చెరొక రూ.5 వేల చొప్పున మొత్తంగా రూ.10 వేలు పొందొచ్చు.
COMMENTS