మీ Gmail పాస్ వర్డ్ మర్చిపోయారా? ఇలా తిరిగి పొందండి..!
Forgot your Gmail password? Get it back like this : మీ Gmail పాస్వర్డ్ మరిచిపోయారా?
దాన్ని ఎలా తిరిగి
పొందాలి అని చూస్తున్నారా?
బయపడకండి, ప్రతి సమస్యకీ
పరిస్కారం వుంటుంది. అలాగే,
ఈ సమ్యకు కూడా
పరిస్కారం వుంది. చాలామంది
జీవితం Gmail ఒక ముఖ్యమైన
భాగంగా మారింది.
ఆఫీస్ పనులకే కావచ్చు లేదా వ్యక్తిగత జీవితంలోని అవసరాలకు కూడా అన్ని విషయాలకు ఇది ఉపయోగించబడుతుంది. ముఖ్యంగా, Google యొక్క మరే ఇతర సర్వీస్ అయినా ఉపయోగించలనుకుంటే, మీకు ఇదే Gmail ఖాతా అవసరం అవుతుంది. మరొక విషయం, మీరు Android ఫోన్ ను ఉపయోగిస్తే, ఈ ఖాతా తప్పనిసరి.
కాబట్టి, ఇంత ముఖ్యమైన
ఈ Gmail పాస్ వర్డ్
ను మరచిపోవడం సమస్యగా
ఉంటుంది. మీరు మీ
Gmail పాస్ వర్డ్ ను
మరచిపోతే, మీరు దాన్ని
క్రింది స్టెప్స్ ద్వారా చాలా
సులభంగా తిరిగి పొందగలుగుతారు.
దీని గురించి పూర్తిగా
స్టెప్ బై స్టెప్
తెలుసుకుందాం
మీరు మీ Gmail పాస్
వర్డ్ ను మరచిపోతే
ఎలా ?
Step
1 - మొదట మీ Google Account లేదా Gmail పేజీని
తెరవండి.
Step
2 - ఇప్పుడు గూగుల్ లాగిన్
పేజీలోని 'Forget Password' ఎంపిక పై
క్లిక్ చేయండి.
Step
3 - మీకు గుర్తుంకువున్న చివరి
పాస్ వర్డ్ ను
నమోదు చేయండి. మీకు
పాస్ వర్డ్ గుర్తులేకపోతే,
'మరో మార్గం ప్రయత్నించండి'
(Try another way) ఎంచుకోండి.
Step
4 - మీ Gmail ఖాతాకు లింక్
చేయబడిన ఫోన్ నంబర్
కు గూగుల్ ఒక
మెసేజ్ పంపుతుంది.
Step
5 - మీకు ఫోన్ నంబర్
లేకపోతే, Google మీ ఇమెయిల్
కు ఒక వెరిఫికేషన్
కోడ్ను పంపుతుంది. మీకు
ప్రత్యామ్నాయ ఇమెయిల్ లేకపోతే,
'Try another way' ఎంచుకోండి.
Step
6 - ఇక్కడ మీకు ఇమెయిల్
పంపగల మరొక ఇమెయిల్
ఐడి ని గూగుల్
అడుగుతుంది.
Step
7: ఇప్పుడు మీరు గూగుల్
నుండి ఇమెయిల్ వచ్చినప్పుడు
గూగుల్ డైలాగ్ బాక్స్
పేజీని తెరవండి.
Step
8 - మీ పాస్వర్డ్ రికవర్
అయిన తర్వాత, క్రొత్త
పాస్ వర్డ్ ఉపయోగించి
మీ Gmail కి లాగిన్
అవ్వండి.
COMMENTS