మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ లాక్ మర్చిపోయారా..!
Forgot your Android mobile phone lock: సాధరణం ఎప్పుడైనా ఒకేసారి అనుకోకుండా ఫోన్ లాక్ చేసి దాన్ని మర్చిపోతుంటారు. ఇది అతి సాధారణ సమస్య మరియు దీని పరిస్కారం కూడా వుంది. మీరు కూడా మీ ఆండ్రాయిడ్ ఫోన్ లాక్ మరిచిపోయారా?. మీ స్మార్ట్ ఫోన్ లాక్ మర్చిపోవడం మీకు పెద్ద తలనెప్పిగా వుంటుందా. కంగారు పడకండి, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లాక్ చేసి మరిచిపోయినా కూడా సులభంగానే అన్లాక్ చెయ్యొచ్చు. ఈ పని ఏవిధంగా చెయ్యవచునో ఈ క్రింద స్టెప్ బై స్టెప్ వివరంగా చూడవచ్చు.
ఏమిచేయాలి?
1. ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ (ఆండ్రాయిడ్ 2.3 మరియు అంతకంటే పైవాటి కోసం)
2. స్మార్ట్ లాక్ (ఆండ్రాయిడ్ 5.0 మరియు అంతకంటే పైవాటి కోసం)
3. యూస్ యువర్ గూగుల్ అకౌంట్ (ఆండ్రాయిడ్ 4.4 మరియు అంతకంటే క్రింద వాటికోసం)
4. థర్డ్ పార్టీ సెక్యూరిటీ అప్షన్స్
5. ఫ్యాక్టరీ రీసెట్
మీ ఆండ్రాయిడ్ ఫోన్ పిన్ లాక్ చేస్తే, ఇది సరళమైనది మరియు ఉత్తమైనది కూడా.
మీ ఫోనులో గూగుల్ ఖాతాకి లాగిన్ చేసి ఆండ్రాయిడ్ డివైజ్ నిర్వహణకు లాగిన్ చేయండి మరియు మీ ఖాతాలో సంబంధిత పరికరాల జాబితా నుండి ప్రశ్నర్ధకమైన పరికరాన్ని ఎంచుకోండి. మీకు లాక్ ప్యాట్రన్ ప్రత్యక్షమవుతుంది, ఇప్పుడు మీరు మీ ఫోనులో స్పష్టమైన లాక్ చేయండి. మీ ఫోనును కొత్త కోడుతో లాక్ చేసిన తరువాత, ఇది ఈ కొత్త కొడుకు మీరు మర్చిపోయిన కోడ్ స్థానంలో భర్తీ చేస్తుంది. ఇక మీరు ఈ కొత్త కొడుతో మీ ఫోన్లోకి అనుమతించబడతారు.
అయితే, గూగుల్ యొక్క కొత్త అప్డేట్స్ కఠినమైన భద్రతను కలిగివుంటాయి. ఇక్కడ గూగుల్ అకౌంట్ లాగిన్ తో ఫోన్ అన్లాక్ అవుతుంది. అయితే విశిష్టమైన స్మార్ట్ లాక్ కలిగి మీ హోమ్ Wi-Fi కి కనెక్ట్ చేసినట్లయితే, ఫోన్ స్వయంచాలకంగా అన్లాక్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ ప్యాట్రన్ లేదా పిన్ లాక్ మర్చిపోతే మీ హోమ్ వై ఫై తో అన్లాక్ చేసుకోవచ్చు.
మీ ఫోన్ యొక్క ప్యాట్రన్ లాక్ మరిచిపోతే చింతించాల్సిన అవసరంలేదు, దానిని అన్లాక్ చేయడానికి సరైన మరియు సులభమైన పద్దతి ఇక్కడవుంది.
1. మీ ఫోన్ అన్లాక్ చేయడానికి 5 సార్లు ప్రయత్నించండి
2. ఈ ఐదువ ప్రయత్నం తరువాత కూడా అన్లాక్ అవకుంటే, స్క్రీన్ దుగువన "Forgot Patron" అనికనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి.
3. మీ గూగుల్ ఖాతాకి లాగిన్ చేయండి.
4. మీ గూగుల్ ఖాతాతో లాగిన్ చేసిన తరువాత, కొత్త పిన్, ప్యాట్రన్, లాక్ ,వంటి వాటికి అన్లాక్ చేయగలుగుతారు.
ఈ విధంగా కూడా మీ ఫోన్ అన్లాక్ అవ్వకుంటే, ఫ్యాక్టరీ రీసెట్ చేయండి. అయితే, దీనివలన మీ డివైజ్ లోని పూర్తి డేటా తెసివేయబడుతుంది కాబట్టి, పైన తెలిపిన అన్ని విధానాలను ప్రయత్నించిన తరువాతే, ఈ విధానాన్ని ఎంచుకోండి.
COMMENTS