Fenugreek Water: ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
(Fenugreek
Water) మనం కొత్తిమీర వాడినంతగా
మెంతి గింజలను వాడం.
ఎందుకంటే ఇవి కొంచెం
చేదుగా ఉండటమే ప్రధాన
కారణం. ఇవి రుచిని
పెంచడంతో పాటు మన
ఆరోగ్యానికి చాలా మేలు
చేస్తాయి. వంటింట్లో దొరికే
ఈ గింజలతో ఎన్నో
వ్యాధులను నయం చేసుకోవచ్చు.
ఇది ఔషధం మొదలుకొని
సౌందర్య సాధనం వరకు
అన్ని రకాల ఉత్పత్తుల
తయారీలో ఉపయోగిస్తుంటారు.
మెంతి గింజల్లో విటమిన్ సి, బి1, బి2, కాల్షియం వంటి శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ఇవి చర్మం మెరిసేలా చేయడంతోపాటు జట్టు పెరిగేందుకు ఉపయోగపడుతుంది. ఉదయం పూట పరిగడుపున మెంతి గింజల నీటిని తాగడం వల్ల శరీరంలోని మలినాలను బయటకు పంపుతుంది. అలాగే మధుమేహం, మలబద్ధకం వంటి సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చు.
మెంతి ద్రావణం తయారు ఎలా?
మెంతి నీరు తయారు చేయడానికి 10 నిమిషాల సమయం పడుతుంది. ఒకటి, ఒకటిన్నర చెంచాల మెంతి గింజలను తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని ఫిల్టర్ చేయాలి. అనంతరం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. వడగట్టగా మిగిలిన మెంతి గింజలను విసిరేయకుండా వంటల్లో వాడుకోవచ్చు లేదా తినొచ్చని గుర్తుంచుకోండి. మెంతులు వేడి చేస్తాయి. అందుకని గర్భిణులు వైద్యుల సలహా మేరకు మాత్రమే తినాలి.
మెంతి ద్రావణంతో ప్రయోజనాలు:
బరువు తగ్గించడం
మెంతి కూరలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరం బరువు తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
చర్మం, జుట్టు ఆరోగ్యం
మెంతి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రభావవంతంగా ఉంటాయి. వీటిని వివిధ సౌందర్య సాధనాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. మెంతి ఆకుల్లో ఉండే ప్రొటీన్ జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
కడుపు నొప్పులు
మెంతి నీరు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపు సంబంధ సమస్యలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మెంతి నీరు తాగడం అలవాటు చేసుకోవాలి.
గుండెకు మంచిది
మెంతి గింజల నీరు గుండెలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే, కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుతుంది.
మధుమేహానికి చెక్
పురాతన కాలం నుంచి మధుమేహాన్ని నియంత్రించేందుకు మెంతి గింజలను వాడుతుంటారు. ప్రతీ నిత్యం మెంతి నీరు తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. మెంతి గింజల్లో ఉండే అమైనో ఆమ్లాలు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. మెంతి గింజ నీటిని నిత్యం 3 సార్లు తీసుకుంటే చాలా వరకు డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
COMMENTS