మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్ లు యాక్టివ్ గా ఉన్నాయో తెలుసా..!!
Do you know how many SIM cards are active on your name : వాస్తవానికి, ఒకప్పుడు ఎవరి పేరుమీద ఎన్ని SIM కార్డులు తీసుకున్నారు మరియు వాటిలకో వాటిలో ఎన్ని సిమ్ కార్డులు లేదా మొబైల్ నంబర్లు యాక్టివ్ గా ఉన్నాయో అని తెలుసుకోవాలంటే చాలా కష్టం. అయితే, కొత్తగా DoT తీసుకువచ్చిన ఆన్లైన్ సైట్ ద్వారా మీ పేరు మీద మీరు తీసుకున్న అన్ని మొబైల్ నంబర్ వివరాలను సవివరంగా మరియు క్షణాల్లో పూర్తిగా తెలుసుకోవచ్చు. మరి ఆ వివరాలను ఎలా పొందాలి అనే విషయాన్ని గురించి ఈరోజు చూద్దాం.
మీ ఆధార్ కార్డు పైన ఎన్ని మొబైల్ నంబర్లను తీసుకున్నారో, అందులో
ఎన్ని నంబర్లు యాక్టివ్ గా ఉన్నాయో కూడా చెక్ చేసుకోవచ్చు. డిపార్ట్మెంట్
ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) ఒక
కొత్త వెబ్సైట్ ను ప్రారంభించింది. టెలికాం
అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ & కన్స్యూమర్
ప్రొటెక్షన్ (TAFCOP) పేరుతో ఈ వెబ్సైట్ ను తీసుకొచ్చింది. ఈ
వెబ్సైట్ ద్వారా మీ ఆధార్ నంబర్ పైన తీసుకున్న అన్ని SIM కార్డ్
ల వివరాలను మరియు యాక్టివ్ నంబర్ స్టేటస్ ను కూడా తెలుసుకోవచ్చు. మీ
పేరు మీద ఎన్ని SIM కార్డ్
లు యాక్టివ్ గా ఉన్నాయో వివరాలను పొందడానికి ఈ క్రింది ఇచ్చిన స్టెప్స్ ఫాలో అవ్వండి.
మీ మొబైల్ ఫోన్ బ్రౌజర్ లేదా ల్యాప్టాప్ లేదా కంప్యూటర్లో tafcop.dgtelecom.gov.in వెబ్ సైట్ ని తెరవండి. తరువాత,
సూచించిన వద్ద మీ మొబైల్ నంబర్ నమోదు
చేయండి. క్రింద
OTP రిక్వెస్ట్ కోసం సూచించిన
బాక్స్ పైన నొక్కండి. మీ
మొబైల్ నంబర్ కు వచ్చిన OTP ని
ఎంటర్ చేసి తనిఖీ చేయండి.
OTP ని ధృవీకరించిన తరువాత, మీ పేరులో పనిచేసే అన్ని మొబైల్ నంబర్స్ యొక్క పూర్తి జాబితాను మీరు అందుకుంటారు. వాటిలో, మీరు మీ సౌలభ్యం ప్రకారం ఏదైనా నంబర్ గురించి రిపోర్ట్ చెయవచ్చు. తరువాత, మీరు కోరుకున్న నంబర్ మాత్రమే వాడుకలో ఉంటుంది మరియు మీరు ఫిర్యాదు చేసిన నంబర్లను ప్రభుత్వం తనిఖీ చేస్తుంది.
COMMENTS