బార్లీ గింజలతో ఈ సమస్యలకు చెక్
Check for these problems with barley grains: శారీరకంగా అలసిపోవడం, మానసిక
ఒత్తిడికి గురికావడం వంటి సమస్యలకు బార్లీ గింజలతో చెక్ పెట్టొచ్చు. అదెలాగో
ఇప్పుడు తెలుసుకుందాం.
- బార్లీ గింజలలో శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా
ఉంటాయి.
- ఉడికించిన బార్లీ గింజల్లో కొంచెం నిమ్మరసం, దానిమ్మ గింజలు, నానబెట్టిన పెసలు
కలిపి తినాలి. క్రమం తప్పకుండా బార్లీని ఆహారంలో భాగం చేసుకుంటే చర్మం కాంతివంతంగా
మారుతుంది.
- బార్లీ గింజల్లో దొరికే క్యాల్షియం, కాపర్, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు
ఎముకలను దృఢంగా ఉంచుతాయి. పీచు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇందు వల్ల ఆహారం తేలిగ్గా
జీర్ణం అవుతుంది.
- బార్లీ జావ ఆకలిని పెంచుతుంది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. మధుమేహం, హృద్రోగాలు,
కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా
కాపాడుతుంది. ఇందులో ఉన్న బీటా గ్లూకాన్స్ కొలెస్ట్రాల్ స్థాయిని
నియంత్రిస్తాయి.
- అరకప్పు బార్లీ గింజలను 6 కప్పుల నీళ్లతో ఉడికించి వడకట్టి తాగితే కిడ్నీ
సమస్యలతో పాటు ఇతర అనారోగ్యాలూ దరిచేరవు.
COMMENTS