కలబందతో అధిక బరువుకు చెక్!
Check for overweight with aloevera: బరువు పెరగకుండా ఉండటానికి, బరువు
తగ్గించడానికి అమ్మాయిలు ఎన్నో కసరత్తులు చేస్తుంటారు. ఆహార నియమాలు కూడా పాటిస్తుంటారు.
అయితే కలబందలోనూ (అలోవెరా) బరువును తగ్గించే గుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు
చెబుతున్నారు.
శరీరానికి అవసరమైన పోషకాలన్నింటినీ కలబంద అందిస్తుంది. దీనిలో ఎ, బి, సి, ఇ
విటమిన్లతోపాటు 18 రకాల అమైనో ఆసిడ్లు ఉంటాయి. ఇవి శరీరంలోని మలినాలను తొలగించి,
మెటబాలిజాన్ని మెరుగుపరుస్తాయి. తద్వారా బరువును తగ్గుతుంది.
కలబందలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. రోజూ ఉదయాన్నే ఉసిరి, తులసితో కలిపి
తీసుకుంటే శరీరం లోపల నుంచి క్లెన్సింగ్ అవుతుంది.
ఎసిడిటీ, గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలు ఉన్న వారికి ఇది చక్కని పరిష్కారం. కలబంద
రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించడమేకాక మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
కలబంద చర్మాన్ని మృదువుగా తాజాగా చేయడంతో పాటు మెరుపునూ అందిస్తుంది. కురులను
బలంగా మారుస్తుంది.
కలబందను నేరుగా తీసుకోవడం నచ్చకపోతే కప్పు కలబంద గుజ్జుకు టేబుల్ స్పూను చొప్పున
నిమ్మరసం, బెల్లం, గ్లాసు నీరు కలిపి మిక్సీ పట్టి పరగడుపున తాగితే ప్రయోజనం
ఉంటుంది. అవసరం అనుకుంటే తేనెనీ కలుపుకోవచ్చు.
శరీరానికి అవసరమైన పోషకాలన్నింటినీ కలబంద అందిస్తుంది. దీనిలో ఎ, బి, సి, ఇ విటమిన్లతోపాటు 18 రకాల అమైనో ఆసిడ్లు ఉంటాయి. ఇవి శరీరంలోని మలినాలను తొలగించి, మెటబాలిజాన్ని మెరుగుపరుస్తాయి. తద్వారా బరువును తగ్గుతుంది.
కలబందలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. రోజూ ఉదయాన్నే ఉసిరి, తులసితో కలిపి తీసుకుంటే శరీరం లోపల నుంచి క్లెన్సింగ్ అవుతుంది.ఎసిడిటీ, గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలు ఉన్న వారికి ఇది చక్కని పరిష్కారం. కలబంద రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించడమేకాక మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
కలబంద చర్మాన్ని మృదువుగా తాజాగా చేయడంతో పాటు మెరుపునూ అందిస్తుంది. కురులను బలంగా మారుస్తుంది.
కలబందను నేరుగా తీసుకోవడం నచ్చకపోతే కప్పు కలబంద గుజ్జుకు టేబుల్ స్పూను చొప్పున నిమ్మరసం, బెల్లం, గ్లాసు నీరు కలిపి మిక్సీ పట్టి పరగడుపున తాగితే ప్రయోజనం ఉంటుంది. అవసరం అనుకుంటే తేనెనీ కలుపుకోవచ్చు.
COMMENTS